News February 8, 2025
జాతీయ ఉత్తమ సేవా పురస్కారానికి జిల్లా వాసి
కామారెడ్డి జిల్లా రక్త దాతల సమూహ అధ్యక్షుడు జమీల్ సాయి సేవ భగవాన్ జాతీయ ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపికైనట్లు రక్త దాతల ఫౌండర్ డా.బాలు శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి గుంటూరు జిల్లా చిలకలూరిపేట జయ జయ సాయి ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం చిలకలూరిపేటలో ఈ పురస్కారాన్ని జమీల్ అందుకొనున్నారు.
Similar News
News February 8, 2025
చౌడేపల్లి: ప్రమాదం జరిగితే గానీ స్పందించరా..?
చౌడేపల్లి సోమల మార్గంలోని డ్యాం వద్ద రోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డు మధ్యలో కల్వట్టు కుంగడంతో గుంత ఏర్పడింది. వాహనదారులు ఆదమరిస్తే పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగితే గానీ స్పందించరానంటూ ప్రజలు ప్రయాణికులు అధికారులు తీరుపై మండిపడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
News February 8, 2025
భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ
ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో మాఘమాసం శనివారం ఆలయ అర్చకులు ఉదయాన్నే శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ అర్చకులు తదితరులున్నారు.
News February 8, 2025
ఆప్‌కు బిగ్ షాక్
అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడదామనుకున్న ఆప్‌కు ఫలితాల్లో ఎదురుగాలి వీస్తోంది. BJP 42 చోట్ల లీడింగ్‌లో ఉండగా ఆ పార్టీ కేవలం 25 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకంటే ముఖ్యంగా ఆప్ అగ్రనేతలు వెనుకంజలో ఉండటం పార్టీ శ్రేణులను షాక్‌కు గురి చేస్తోంది. కేజ్రీవాల్, ఆతిశీ, మనీశ్ సిసోడియా, ఇమ్రాన్ హుస్సేన్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వెనుకంజలోనే కొనసాగుతున్నారు.