News March 19, 2025

జి. కొండూరు: వరుసకు కూతురితో అసభ్య ప్రవర్తన

image

కూతురు వరుసయ్యే బాలికతో వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జి. కొండూరు(M) చెవుటూరులో జరిగింది. విజయవాడకు చెందిన మహిళ భర్తతో విడిపోయింది. కొడుకు, కమార్తెతో వచ్చి రవీంద్రతో ఉంటోంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ వ్యక్తి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి పని నుంచి ఇంటికి రాగానే చిన్నారి జరిగిందంతా చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో కేసు నమోదు చేయగా.. అవమానంతో వ్యక్తి విషం తాగాడు.

Similar News

News March 19, 2025

ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షలకు ఆహ్వానం : డీఈవో రాము

image

జగిత్యాల జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 2025-26కు తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ రాము తెలిపారు. 7, 8, 9, 10వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. స్వీకరణకు చివరి తేదీ ఈనెల 20. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఏప్రిల్ 21. పరీక్ష తేదీ 27. 

News March 19, 2025

 కౌలు రైతులకు రూ.100 కోట్ల రుణాలు ఇవ్వాలి: బాపట్ల కలెక్టర్

image

వ్యవసాయంపై ఆధారపడిన జిల్లాలోని రైతులకు బ్యాంకర్లు అధిక రుణ సౌకర్యం కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్షా సమావేశం బుధవారం బాపట్ల కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ప్రాధాన్యత రంగాలు, ప్రాధాన్యత లేని రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు నూరు శాతం చేరుకోవాలన్నారు. కౌలు రైతులకు రూ.100 కోట్ల రుణాలు ఇవ్వాలన్నారు.

News March 19, 2025

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

image

ఇవాళ జరిగిన కేంద్ర క్యాబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
✤ రూ.2 వేల కంటే తక్కువ లావాదేవీలకు (పర్సన్ టు మర్చంట్) యూపీఐ ఛార్జీలు ఉండవు
✤ అస్సాంలో రూ.10,601 కోట్లతో అమ్మోనియా, యూరియా ఫ్యాక్టరీ ఏర్పాటు
✤ మహారాష్ట్రలో రూ.4,500 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ హైవే
✤ గోకుల్ మిషన్‌కు రూ.3,400 కోట్లు.

error: Content is protected !!