News April 2, 2025
జిన్నారం: వాహనం తనిఖీ చేస్తున్న ఎస్ఐని ఢీకొట్టిన కారు

జిన్నారం మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐ నాగలక్ష్మి తన సిబ్బందితో నిర్వహించారు. తనిఖీలు నిర్వహిస్తున్న నాగలక్ష్మిని మద్యం మత్తులో కారు ఢీకొని వెళ్లిపోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించడంతో కారును కొద్దిపాటి దూరంలో వదిలి పారిపోయారు. స్వల్ప గాయాలతో ఎస్ఐ నాగలక్ష్మి బయటపడ్డారు.
Similar News
News April 5, 2025
MDCL: ఇంటి వద్దనే టీకా..ఎందుకలా..?

గ్రేటర్ హైదరాబాద్‌లో అనేక మంది 15 ఏళ్లలోపు పిల్లలకు అందించాల్సిన టీకాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని టీకాలు తీసుకుని కొన్ని నెలల తర్వాత మానేస్తున్నారని వైద్య బృందం గుర్తించింది. దీంతో పిల్లలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారని గమనించి, ఇక లాభం లేదని గుర్తించి, పిల్లల ఇంటికే వెళ్లి టీకాలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు డాక్టర్లు తెలిపారు.
News April 5, 2025
CSKvsDC: టాస్ గెలిచిన ఢిల్లీ.. జట్లు ఇవే

CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.
CSK: రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్, విజయ్ శంకర్, జడేజా, ధోని, అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్, మతీషా పతిరణ
DC: మెక్‌గర్క్, KL రాహుల్, పోరెల్, స్టబ్స్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్, అశుతోష్, విప్రజ్, స్టార్క్, కుల్దీప్, మోహిత్ శర్మ
News April 5, 2025
ఈ అవార్డు భారతీయులకు అంకితం: మోదీ

శ్రీలంక తనకు ప్రదానం చేసిన అత్యున్నత పురస్కారం ‘మిత్ర విభూషణ’ను 140 కోట్ల భారతీయులకు అంకితం చేస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర దిసనాయకే చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు. ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకు శ్రీలంక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు రక్షణ రంగానికి సంబంధించి పలు ఒప్పందాలపై ఇరు దేశాధినేతలు MoU కుదుర్చుకున్నారు.