News March 17, 2025
జియ్యమ్మవలసలో ఏనుగులు గుంపు సంచారం

జియ్యమ్మవలస మండలం నందివాని వలస, తోటపల్లి, సింగాణపురం గౌరీపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి చెరకు, అరటి తోటల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయవద్దని, రైతులు పొలాలకు వెళ్లొద్దని సూచించారు.
Similar News
News March 17, 2025
REWIND: 1967వ నాటి ఆమదాలవలస రైల్వే స్టేషన్

ఆమదాలవలస పట్టణంలో శ్రీకాకుళం రోడ్డు పేరుతో ఉన్న రైల్వే స్టేషన్ జిల్లాలోని అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా ఉంది. అలాంటి రైల్వే స్టేషన్ 1967వ సంవత్సరంలో ఎలా ఉండేదో తెలిపే పాత ఫొటో వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్ అకౌంట్‌లలో ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. అప్పటిలో ఆమదాలవలస పట్టణాన్ని ఆముదం పట్టణంగా పిలిచేవారని, అశోకుడి కాలంలో హేరందపల్లిగా పిలుచుకునే వారిని ప్రస్తుతం ఈ ఫొటో ద్వారా చర్చనీయాంశంగా మారింది.
News March 17, 2025
ఉయ్యాలవాడ పేరు పెట్టాలని వినతి

ఓర్వకల్ విమానాశ్రయానికి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉయ్యాలవాడ పేరు పెట్టాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.
News March 17, 2025
కనికట్టు చేయడంలో చంద్రబాబు దిట్ట: బొత్స

AP: ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనికట్టు చేయడంలో CM చంద్రబాబు దిట్ట అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. స్కాముల పేరుతో తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండలిలో ఆయన మండిపడ్డారు. ‘2019-24 మధ్య జరిగిన స్కాముల మీద చర్చ పెట్టారు. కానీ 2014 నుంచి 2024 వరకు జరిగిన స్కాములపై మేం చర్చకు సిద్ధం. మా హయాంలో ఎలాంటి స్కాములు జరగకుండానే జరిగినట్లు ఆరోపణలు చేస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.