News March 10, 2025

జిల్లా అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్

image

పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ, LRS , UDID, ఇంటర్ పరీక్షలు , వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు, పలు అంశాలపై కలెక్టర్ రాజర్షిషా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ ఈ నెల 10న సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. వేసవి దృష్టా త్వరగా పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు.

Similar News

News March 10, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధరలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. శనివారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ, ప్రైవేటు ధరల్లో ఏలాంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

News March 10, 2025

లక్షెట్టిపేట: కూల్ డ్రింక్ మూత మింగి చిన్నారి మృతి

image

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లక్షెట్టిపేట మండలంలోని ఊట్కూర్‌కు చెందిన సురేందర్ కుమారుడు రుద్ర అయాన్ (9నెలలు) కూల్ డ్రింక్ మూత మింగి మృతిచెందినట్లు SI సతీశ్ తెలిపారు. సురేందర్ కుటుంబసమేతంగా ఆదివారం కొమ్ముగూడెంలోని ఓ శుభ కార్యానికి హాజరయ్యారు. అక్కడ రుద్ర అయాన్ ప్రమాదవశాత్తు ఓ కూల్ డ్రింక్ మూత మింగాడు. గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు.

News March 10, 2025

ఆదిలాబాద్, నిర్మల్‌కు మొండిచేయి

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్‌కు రూ.200కోట్లు, మంచిర్యాలకు రూ.600 కోట్లు మంజూరుకాగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు.

error: Content is protected !!