News November 29, 2024

జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యం: టీజీ భరత్

image

జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 1,000 హెక్టార్ల భూమి ఉంటే పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చని తెలిపారు.

Similar News

News November 29, 2024

రాయలసీమలో వర్షాలు

image

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో నేడు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రేపు అనంతపురం, సత్యసాయి, డిసెంబర్ 1న అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News November 29, 2024

జేసీ vs ఆది.. నేడు సీఎం వద్దకు బూడిద పంచాయితీ

image

జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య బూడిద పంచాయితీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. నేడు ఇరువురు నేతలూ సీఎంను కలవనున్నారు. వారంరోజులుగా కొనసాగుతున్న ఈ వివాదానికి తెరదించే అవకాశముంది. ప్రభుత్వంలోని నేతల వ్యవహారమే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాశం కావడం, స్థానికంగా 144 సెక్షన్ విధించే పరిస్థితులు రావడంపై ఇదివరకే సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

News November 29, 2024

వైఎస్ జగన్ ప్రకటన పచ్చి అబద్ధం: మంత్రి సత్యకుమార్

image

మాజీ సీఎం వైఎస్ జగన్‌ మొహంలో అధికారం లేదన్న నిరాశ స్పష్టంగా కనిపిస్తోందని వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గురువారం తాడేపల్లిలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి, కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య రంగంలో 52 వేల మందిని నియమించామంటూ వైఎస్ జగన్ ప్రకటన చేయడం పచ్చి అబద్ధమని పేర్కొన్నారు.