News April 3, 2025
జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలి: ప్రత్యేక అధికారి

అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలులో ఏలూరు జిల్లా ను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలనీ సంక్షేమ పధకాల అమలు పర్యవేక్షణ ఏలూరు జిల్లా ప్రత్యేక అధికారి కె. ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో బుధవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తో కలిసి జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యాలయాల అమలు గురించి అధికారులతో సమావేశం నిర్వహించారు.
Similar News
News April 4, 2025
వరంగల్- HYD పుష్-పుల్ ట్రైన్ నడపండి.. ఎంపీ కావ్య విజ్ఞప్తి

ఉదయం వేళ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు పుష్పుల్ రైలు నడపాలని శుక్రవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈమేరకు పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆమె మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి ప్రజలు రోజువారి పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్తుంటారని, వారికి సౌకర్యార్థంగా రైలులు నడపాలని వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
News April 4, 2025
మంథని: వామన్‌రావు దంపతుల హత్య కేసు (UPDATE)

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గట్టు వామన్‌రావు న్యాయవాద దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. రికార్డులను పరిశీలించిన తర్వాతే సీబీఐ విచారణ జరపాలా? లేదా? అనే విషయాన్ని నిర్ణయిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
News April 4, 2025
SRH ఇక పుంజుకోవడం కష్టం: కైఫ్

SRH ఆటపై మాజీ క్రికెటర్ కైఫ్ విమర్శలు గుప్పించారు. ‘ఆ జట్టు బ్యాటింగ్ క్లిక్ అవడం లేదు. బౌలింగ్ చాలా పేలవంగా ఉంది. కెప్టెన్సీ మరీ దారుణంగా కనిపిస్తోంది. స్పిన్నర్లు నిన్న అద్భుతంగా వేసినా వారికి మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు. ఆ జట్టుపై ఉన్న అంచనాల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. అభిషేక్, ట్రావిస్ వీక్‌నెస్ బౌలర్లు కనిపెట్టేశారు. వరుసగా 3 మ్యాచులు ఓడిన ఆ టీమ్ ఇక పుంజుకోవడం చాలా కష్టం’ అని పేర్కొన్నారు.