News April 15, 2025
జిల్లాలో 121 దరఖాస్తులు వచ్చాయి: అనకాపల్లి కలెక్టర్

జిల్లాలో గల పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు పాటించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వం ద్వారా 41 పరిశ్రమలకు రైతుల కోసం 121 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటికి రూ.12.91 కోట్ల రాయితీకి కమిటీ ఆమోదం తెలిపిందని అన్నారు.
Similar News
News April 19, 2025
బేగంపేట: యముడు, చిత్రగుప్తుడి అవతారం ఎత్తారు

బేగంపేట చౌరస్తాలో NIPPON ఎక్స్‌ప్రెస్ CSR కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా వాహనదారులకు వినూత్న రీతిలో పోలీసులు యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో ట్రాఫిక్ నిబంధనలపై అవేర్నెస్ కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హెల్మెట్, సీటు బెల్టులేని వారికి వాటి ఆవశ్యకతను వివరించారు. ట్రాఫిక్ ఏసీపీ వెంకటేశ్వర్లు, CI రామచందర్, బోస్‌కిరణ్, SI భూమేశ్వర్, NIPPON సుధీర్ నాయర్, కలీంఅలీ, అనిల్, ప్రియాంక సుధాకర్ సిబ్బంది ఉన్నారు.
News April 19, 2025
పెద్దపల్లి: PACS కొనుగోలు కేంద్రాలు సిద్ధం

పెద్దపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధమయ్యాయి. పీఏసీఎస్ పరిధిలో 200కు పైగా కొనుగోలు కేంద్రాలకు రైతుల తమ ధాన్యాన్ని తరలిస్తున్నారు. దాదాపు 90% వరి కోతలు పూర్తయ్యాయి. మరో నెల రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ కూడా పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు.
News April 19, 2025
కూటమి వైఫల్యాలే వైసీపీకి శ్రీరామరక్ష : ధర్మాన

రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం వైఫల్యాలే వైసీపీకి శ్రీరామరక్షగా నిలుస్తాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. శనివారం తాడేపల్లి కార్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. లేనిపోని హామీలను గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. గడిచి పది నెలలు పూర్తైనా నెరవేర్చలేకపోయారని విమర్శించారు.