News July 6, 2024

జిల్లాలో ఆయ’కట్’కట

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 124 ఎత్తిపోతల పథకాల కింద 32,880 ఎకరాల ఆయకట్టు ఉంది. వీటిలో 74 ఎత్తిపోతల పథకాలు సాగునీరందిస్తున్నాయి. 50 లిఫ్టులు పూర్తిగా పడకేశాయి. కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోని ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తెచ్చేందుకు ఉభయ జిల్లాల అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నిధులు మంజూరైనా పనులు జాప్యమవటంతో ఈ సీజన్కు సాగునీరందే పరిస్థితి లేకుండా పోయింది.

Similar News

News November 30, 2024

KMM: దారుణం.. డబ్బులిచ్చినా సాయితేజను చంపేశారు..!

image

అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఖమ్మం రాపర్తినగర్‌కు చెందిన <<14749255>>యువకుడు సాయితేజ<<>> చనిపోయిన విషయం తెలిసిందే. MS చదివేందుకు చికాగో వెళ్లిన సాయితేజ అక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాడు జాబ్ చేసే సమయంలో దుండగులు ముసుగు వేసుకొచ్చి అతడిని డబ్బులు అడిగారు. భయపడిన సాయితేజ వెంటనే అతడి దగ్గర ఉన్న డబ్బులన్నీ వారికి ఇచ్చేశాడు. అయినా సరే వారు దారుణంగా సాయితేజ గుండెలపై కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయాడు.

News November 30, 2024

శబరిమలకు వెళ్లి నేలకొండపల్లి వాసి మృతి

image

ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు ప్రకారం.. నేలకొండపల్లి మండల చెన్నారానికి చెందిన శనగాని వెంకన్న అయ్యప్ప స్వామి మాల ధరించి ఇరుముడి సమర్పించేందుకు శబరిమల వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో రక్తపు వాంతులు, విరోచనాలు అయ్యాయి. గమనించిన తోటి అయ్యప్ప స్వాములు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

News November 30, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు ∆} సత్తుపల్లి మండలంలో మంచినీటి సరఫరా బంద్ ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మంలో ప్రజా విజయోత్సవాల కార్యక్రమం ∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన