News April 4, 2025

జిల్లాలో ఇసుక కొరత లేకుండా చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో ఇసుక కొరత రానీయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఆయన జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు. 

Similar News

News April 11, 2025

కృష్ణా: రేపే ఇంటర్ ఫలితాలు.. ఉత్కంఠ 

image

ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థులు ఉత్కంఠతో ఉన్నారు. తొలిసారి ఇంటర్ పరీక్షలు రాసిన ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కంటే ఎక్కువగా, భవిష్యత్ లక్ష్యాలపై ఆశలు పెట్టుకున్న సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో ఉద్విగ్నత కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో 1వ సంవత్సరం 24,557, 2వ సంవత్సరం 20,873 మంది మొత్తం 45వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి. 

News April 11, 2025

మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగింపు

image

మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ రాజబాబును వెంటనే తొలగించాలని ఆదేశించారు. గడిచిన 10 నెలల కాలంలో గనుల శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబుకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు విచారణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయగా రాజబాబుపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను విధుల నుంచి తప్పించారు.

News April 11, 2025

తిరుపతి-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైలు సేవలు.!

image

తిరుపతి-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి మే 25 వరకు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి మచిలీపట్నం, మే 14 నుంచి 26 వరకు ప్రతి సోమవారం మచిలీపట్నం నుంచి తిరుపతికి స్పెషల్ రైలు నడవనుంది. ఈ రైలులో 2AC, 3AC, స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉండనున్నాయి. ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సూచించింది.

error: Content is protected !!