News March 3, 2025
జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ టిఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా గృహాలకు సరఫరా అవుతున్న తాగునీటికి సంబంధించిన పైపులైన్లను తనిఖీ చేయాలని సూచించారు. వచ్చే మూడు నెలలు మంచినీటి ప్రణాళికలను తయారు చేసుకోవలన్నారు.
Similar News
News March 4, 2025
MBNR: రైతు వేదికలపై.. సర్కార్ ఫోకస్

రైతు వేదికలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అధికారులు ప్రత్యేక నివేదికను స్థానిక ఏఈఓలచే స్వీకరించి ఏర్పాటు చేశారు. MBNR-88, NGKL-142, GDWL-94, WNPT-71, NRPT-77 రైతు వేదికలు ఉండగా.. ఒక్క రైతు వేదిక నిర్మించడానికి రూ.22 లక్షలు ఖర్చయింది. పలు రైతు వేదికలు ధ్వంసం అవ్వగా, మరికొన్ని మౌలిక వసతులు లేవు. నిధులు మంజూరు అయితే మరమ్మతులు చేయించనున్నారు.
News March 4, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} నేలకొండపల్లి రైతు వేదికలో రైతు సదస్సు ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన
News March 4, 2025
రైతులందరికీ సాగునీరు అందించాలి: నిర్మల్ కలెక్టర్

యాసంగిలో రైతులందరికీ సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం సీఎస్ నిర్వహించిన వీసీలో ఆమె పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు రెసిడెన్షియల్ హాస్టల్‌లను తనిఖీ చేస్తున్నామని, వేసవిలో గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్‌పై నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.