News March 3, 2025
జిల్లాలో మావోయిస్టు కదలికలు లేవు: ములుగు SP

ములుగు జిల్లాలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా అంతరించిపోయాయని SP శబరిశ్ స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని 25 ఏళ్ల తర్వాత ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారికి అడ్డుగా ఉన్న గేట్లు తెరిచి వాహనాల రాకపోకలకు అనుమతి కల్పించామన్నారు. 2001లో పీపుల్స్ వార్ సభ్యులు ట్రాక్టర్లలో మందుపాతరలు అమర్చి స్టేషన్ పేల్చివేశారని, అయితే ప్రస్తుతం జిల్లాలో వారి కార్యకలాపాలు లేవన్నారు.
Similar News
News March 3, 2025
భూపాలపల్లిలో యాక్సిడెంట్.. ముగ్గురి మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్ క్రాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన పింగిలి రాజిరెడ్డి, లడ్డు, పంబాపూర్‌కు చెందిన సతీష్‌గా ఘటనాస్థలిలోనే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 3, 2025
రోహిత్‌పై కామెంట్స్.. కేంద్రమంత్రి మండిపాటు

రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ <<15636715>>వ్యాఖ్యలను<<>> కేంద్ర మంత్రి మాండవీయ ఖండించారు. క్రీడాకారులను వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు. షామాను సమర్థించిన TMC ఎంపీ సౌగతా రాయ్‌పైనా ఆయన మండిపడ్డారు. బాడీ షేమింగ్‌పై కాంగ్రెస్, టీఎంసీ పార్టీల నేతల మాటలు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై మన దేశ గౌరవాన్ని పెంచే ఆటగాళ్లను కించపరిచేలా మాట్లాడటం సరికాదని మాండవీయ హితవు పలికారు.
News March 3, 2025
సూర్యాపేట: ఉపకార వేతన కోసం దరఖాస్తుల ఆహ్వానం

ఉపకార వేతనాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి లత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరం కళాశాల విద్యార్థులు, యాజమాన్యాలు https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.