News March 22, 2025

జిల్లాలో రక్తహీనత తగ్గింది: కేంద్ర బృందం

image

ర‌క్త‌హీన‌త‌ను నివారించేందుకు ప్ర‌వేశ‌పెట్టిన ప‌లు ప‌థ‌కాల‌ను క్షేత్ర‌స్థాయిలో స‌మ‌ర్థంగా అమ‌లు చేస్తున్న కార‌ణంగానే జిల్లాలో ర‌క్త‌హీన‌త త‌గ్గింద‌ని జిల్లాలో ప‌ర్య‌టించిన కేంద్ర ప్ర‌భుత్వ వైద్య‌ నిపుణుల‌ బృందం అభిప్రాయ‌ప‌డింది. కలెక్టర్ అంబేడ్క‌ర్‌ను కేంద్ర బృంద ప్రతినిధులు శుక్రవారం కలిశారు. జిల్లాలో క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన త‌ర్వాత గుర్తించిన అంశాల‌ను క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు.

Similar News

News March 24, 2025

వైజాగ్‌లో IPL మ్యాచ్.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

image

వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు మ.2 నుంచి రాత్రి 12 గంటల వరకు మధురవాడ స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకుండా సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా దారి మళ్లించారు.

News March 24, 2025

VZM: స్వర్ణంతో సత్తా చాటిన లలిత

image

ఢీల్లీ వేదికగా జరగుతున్న రెండవ ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన కిల్లక లలిత సత్తా చాటింది. ఆదివారం జరిగిన 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించింది. ఇప్పటికే ఆమె శనివారం జరిగిన 400 మీటర్ల పరుగలో రజతం కైవసం చేసుకుందని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.దయానంద్ తెలిపారు. పరుగులో రాణిస్తున్న లలితను పలువురు అభినందించారు.

News March 23, 2025

విజయనగరం పోలీసుల సేవలకు గుర్తింపు

image

రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న ఉగాది పురస్కారాలకు విజయనగరం పోలీస్ శాఖలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది ఎంపికయ్యారు. స్థానిక ఎస్బి ఎస్ఐ వై.సత్యనారాయణ, ఎస్సీ, ఎస్టీ సెల్ ASI ప్రసాదరావు, ఆర్మడ్ రిజర్వ్ ఏఆర్ SI అప్పలరాజు, AR హెడ్ కానిస్టేబుల్ గోవిందం, AR కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఉగాది పురస్కారాలకు ఎంపికైనట్లు ఎస్పీ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

error: Content is protected !!