News January 12, 2025
జిల్లాలో రూ. 14 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం: మంత్రి టీజీ
కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో సెమీ కండక్టర్ రంగంలో రూ. 14 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదిరిందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఇండిచిప్ సెమి కండక్టర్ లిమిటెడ్ కంపెనీ తన భాగస్వామి జపాన్‌కు చెందిన యిటోయే మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వంతో హైదరాబాదులో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎం.ఓ.యూ కుదుర్చుకున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు.
Similar News
News January 12, 2025
ఓర్వకల్లుకు జపాన్ కంపెనీ
కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో సెమీ కండక్టర్ రంగంలో రూ.14 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదిరిందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఇండిచిప్ సెమీ కండక్టర్ లిమిటెడ్ కంపెనీ తన భాగస్వామి జపాన్‌కు చెందిన యిటోయే మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వంతో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో MOU కుదుర్చుకున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు.
News January 11, 2025
ప్రతిష్ఠాత్మకమైనది గ్రీన్కో ప్రాజెక్ట్: పవన్ కళ్యాణ్
ప్రపంచస్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శనివారం కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓర్వకల్లు మండలం గని సమీపంలో ఉన్న సోలార్ పార్క్, గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ను హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.
News January 11, 2025
డోన్ మున్సిపల్ వైస్ ఛైర్మన్‌పై హత్యాయత్నం
నంద్యాల జిల్లా డోన్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ హరికిషన్‌పై హత్యాయత్నం జరిగింది. హరికిషన్ బైకును కారుతో ఢీకొట్టి దుండగులు పరారయ్యారు. ఆయన తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.