News April 2, 2024

జిల్లాలోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఎండలు

image

చుంచుపల్లి: వేసవికాలం ఆరంభంలోనే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. సోమవారం సూర్యుడు భగ్గుమన్నాడు. కొత్తగూడెం పరిధిలోని గరిమెళ్లపాడు, భద్రాచలం సబ్‌ కలెక్టరేట్‌ ఏరియాల్లో 41.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాత కొత్తగూడెంలో 40.5, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్‌లో 40.4, సీతారాంపట్నం, యానంబైలులో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు

Similar News

News September 30, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మిర్చి ధర ఎంతంటే

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సెలవులు అనంతరం ఈరోజు ఉదయం ప్రారంభమైంది. అయితే ఖమ్మం మిర్చి మార్కెట్లో ఆదివారం క్వింటా ఏసీ మిర్చి ధర 20వేల రూపాయలు పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ సరుకులను మార్కెట్ తరలించే సమయంలో పలు జాగ్రత్తలు పాటించి క్రయ విక్రయాలు జరుపుకోవాలని మార్కెట్ అధికారులు పేర్కొన్నారు.

News September 30, 2024

ఖమ్మం: కాసేపట్లో రిజల్ట్స్.. పోటీ ఇలా..

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
ఖమ్మం 2938 321 1: 09
భద్రాద్రి 2414 260 1:10

News September 30, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
∆} ములకలపల్లి మండలంలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} కరకగూడెంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
∆} కొత్తగూడెంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు