News March 21, 2025
జీవనోపాధికి వెళ్లి కువైట్‌లో గుండెపోటుతో మృతి

జీవనోపాధికి కువైట్ వెళ్లిన సఖినేటిపల్లి మండలం గొంది గ్రామానికి చెందిన చింతా సాగర్ (34) ఈ నెల 18న గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నెల 19న కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. 2022లో కారు డ్రైవర్‌గా పని చేసేందుకు సాగర్ కువైట్ వెళ్లారు. రెండేళ్ల తర్వాత ఇంటికి వచ్చి మళ్లీ గత ఏడాది జులైలో కువైట్ వెళ్లి అక్కడ మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
Similar News
News March 31, 2025
నిర్మల్: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. నిర్మల్ జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.
News March 31, 2025
మంచిర్యాల: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. మంచిర్యాల జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.
News March 31, 2025
కరీంనగర్: గ్రామాల్లో జోరుగా పైరవీలు..?

KNR జిల్లావ్యాప్తంగా జరిగిన ప్రజాపాలనలో ప్రజలు ఇందిరమ్మ ఇండ్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారుల లిస్ట్‌ను ఫైనల్ చేయలేదు. జిల్లాకు 17,500 ఇళ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలోని అధికారపార్టీకి చెందిన చోటామోటా నాయకులు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని జోరుగా పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. అసలైన అర్హులు తమకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో, రాదో అని ఆందోళన చెందుతున్నారు.