News March 31, 2024
జీహెచ్ఎంసీ పరిధిలో 4 లక్షల మంది పన్ను కట్టలేదు!
HYDలో ప్రస్తుతం 19,03,865 నిర్మాణాలు ఆస్తి పన్ను పరిధిలో ఉండగా.. సుమారు 4 లక్షల మంది పన్ను చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు ఆస్తులతో పాటు వందలాది ప్రభుత్వ ఆస్తులు కలిపి రూ.9,803.39 కోట్లు బకాయి పడ్డాయి. ఏప్రిల్ 1 నుంచి ఆస్తి పన్నుపై 5% వడ్డీ రాయితీతో ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది.
Similar News
News January 13, 2025
HYDలో విదేశీయులు.. అందు కోసమే..!
HYDలో నేటి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనున్న నేపథ్యంలో, 3 రోజులకు ముందుగానే విదేశీయులు హైదరాబాద్ చేరుకున్నట్లుగా తెలంగాణ టూరిజం శాఖ తెలిపింది. చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండ కోట లాంటి చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించిన కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశస్థులు మన సంస్కృతిని కొనియాడారు.
News January 13, 2025
HYD: మొగిలిగిద్దకు సీఎం రాక
HYD శివారు షాద్‌నగర్‌లోని ఫరూఖ్‌నగర్ మండలంలో మొగిలిగిద్ద గ్రామ ప్రభుత్వ పాఠశాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని గ్రామానికి చెందిన ప్రొఫెసర్ గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. మొగిలిగిద్దలో పాఠశాలను ప్రారంభించి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఉత్సవాలను ప్రారంభించడానికి రావాలని సీఎంను ఆహ్వానించారు.
News January 12, 2025
HYD: ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది: దానం
ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుందని MLA దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ కార్ రేసుతో HYD ఇమేజ్ పెరిగిందన్నాను.. కానీ అవినీతి జరగలేదని చెప్పలేదన్నారు. కంటి తుడుపు చర్యల్లా మూసీ వద్ద నాయకులు ఒక్కరోజు నిద్ర చేశారన్నారు. అక్కడికి వెళ్లే ముందే ACలు పెట్టించుకుని పడుకున్నారన్నారు. అక్కడివారు చేసిన జొన్న రెట్టేలు కాకుండా కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకున్నారని ఆరోపించారు.