News November 29, 2024
జుక్కల్: రాత్రి రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి
హైవే-161 పై గురువారం <<14736707>>రాత్రి<<>> రోడ్డుప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జుక్కల్ SI వివరాల ప్రకారం.. బిచ్కుంద మండలం పెద్ద తక్కడ్ పల్లికి చెందిన వంశీ(24), కార్తీక్ అన్నదమ్ముల కుమారులు. వీరు బైక్‌పై పంటను చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈప్రమాదంలో వీరు స్పాట్‌లోనే మృతిచెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కార్తీక్ భార్య 5 నెలల గర్బిణి.
Similar News
News February 2, 2025
NZB: ఉత్తరాది బడ్జెట్‌లా ఉంది: DCC అధ్యక్షుడు
కేంద్ర బడ్జెట్ పూర్తిగా ఉత్తరాది బడ్జెట్‌లా ఉందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు భారీ కేటాయింపులు చేసి ఆదాయం ఇచ్చే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేశారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వే లైన్‌కు పైసా ఇవ్వలేదని, గల్ఫ్ కార్మికుల కోసం పాలసీ ఏర్పాటు చేయలేదన్నారు.
News February 2, 2025
NZB: పసుపు బోర్డుకు గుండు సున్నా: ఎమ్మెల్సీ కవిత
పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా కేటాయించకపోవడంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు తరహాలోనే పని చేసే స్పైసెస్ బోర్డు, టీ బోర్డు, కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డులకు నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డుకు మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. నిజామాబాద్ రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.
News February 1, 2025
ఆర్మూర్: కేంద్ర మంత్రిని కలిసిన పల్లె గంగారెడ్డి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను నేషనల్ టర్మరిక్ బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శనివారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. పసుపు బోర్డు ఛైర్మన్ పదవి చేపట్టడానికి సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించారు. పసుపు రైతుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు.