News March 17, 2025
జుక్కల్: హోలీ ఆడి, స్నానానికి వెళ్లి శవమై తేలాడు

జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల గ్రామానికి చెందిన ప్రకాష్ దేవాడ అనే యువకుడు చెరువులో పడి మృతి చెందినట్లు జుక్కల్ ఎస్ఐ భువనేశ్వర్ తెలిపారు. ఈ నెల 14న హోళీ ఆడి తన తోటి మిత్రులతో దేశ్ముక్ చెరువులో స్నానానికి వెళ్లి బురదలో ఇరుక్కుని ఈ నెల 16న శవమై తేలినట్లు తల్లి చందాబాయి ఫిర్యాదు చేసిందని అన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.
Similar News
News March 17, 2025
సిరిసిల్ల: మహిళలను అభినందించిన కలెక్టర్

ఈనెల 20వ తేదీ నుంచి ఢిల్లీలో జరుగుతున్న కే లో ఇండియా పారా గేమ్స్‌కు ఎంపికైన మిట్టపల్లి అర్చన, భూక్య సక్కుబాయిలను కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో ఇటువంటి మైలురాయిలు మరెన్నో చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి రాందాస్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.
News March 17, 2025
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

AP: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ సీఐడీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 28 వరకు ఆయనకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వంశీని కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అంగీకరించింది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు ఈ నెల 19కు వాయిదా వేసింది.
News March 17, 2025
సిరిసిల్ల: బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే: ఎస్పీ

ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాజన్న సిరిసిల్లజిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల 18 ఫిర్యాదులను స్వీకరించారు.