News March 7, 2025
జూబ్లీహిల్స్: నేటి నుంచి జాతీయ టెన్నిస్ పోటీలు

జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో శుక్రవారం నుంచి నేషనల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నారు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు జేఐసీ సెక్రటరీ కిలారు రాజేశ్వర రావు తెలిపారు. జాతీయ స్థాయి హోటా, జేఐసీ నేషనల్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ నగరంలో జరుగుతాయన్నారు. 3 రోజుల పాటు పోటీలు నిర్వహిస్తామన్నారు.
Similar News
News April 22, 2025
HYD: మన జిల్లాలకు వచ్చిన ర్యాంకుల వివరాలు

ఇంటర్ ఫస్టియర్‌లో..
మేడ్చల్ 77.21 శాతంతో స్టేట్ 1వ ర్యాంక్
రంగారెడ్డి 76.36 శాతంతో స్టేట్ 2వ ర్యాంక్
హైదరాబాద్ 66.68 స్టేట్ 7వ ర్యాంక్
వికారాబాద్ 61.31 స్టేట్ 12వ ర్యాంక్
ఇంటర్ సెకండియర్‌లో..
మేడ్చల్ 77.91 శాతంతో స్టేట్ 3వ ర్యాంక్
రంగారెడ్డి 77.53 శాతంతో స్టేట్ 4వ ర్యాంక్
వికారాబాద్ 68.20 స్టేట్ 21వ ర్యాంక్
హైదరాబాద్ 67.74 స్టేట్ 23వ ర్యాంక్
News April 22, 2025
రంగారెడ్డి: రైతు బిడ్డకు ఇంటర్‌లో TOP RANK

రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతుబిడ్డ తెలంగాణ ఇంటర్ ఫస్టియర్‌లో టాపర్‌గా నిలిచింది. ఇబ్రహీంపట్నం మం. పోచారానికి చెందిన నగేశ్ గౌడ్-సబిత దంపతుల కూతురు శ్రీవార్షిక MPCలో 470 మార్కులకు 468 మార్కులు సాధించింది. ఇంగ్లిష్, సంస్కృతంలోనే ఒక్కో మార్కు రాలేదు. మిగతా అన్ని సబ్జెక్టుల్లో ఫుల్ మార్క్స్ వచ్చాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో తెలంగాణ స్టేట్ టాప్ ర్యాంకర్‌గా రైతు బిడ్డ నిలవడం గర్వకారణం.
SHARE IT
News April 22, 2025
ఇంటర్ ఫలితాల్లో హైదరాబాద్‌కు నిరాశ

ఇంటర్ ఫలితాల్లో మన హైదరాబాద్ విద్యార్థులు నిరాశ పరిచారు. ఫస్టియర్‌లో 66.68 శాతంతో సరిపెట్టుకున్నారు. 85,772 మంది పరీక్ష రాశారు. ఇందులో 57,197 మంది పాస్ అయ్యారు. సెకండియర్‌లో విద్యార్థుల కాస్త మెరుగుపడ్డారు. 74,781 మంది పాస్ పరీక్ష రాయగా.. 50,659 మంది ఉత్తీర్ణులయ్యారు. 67.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. మేడ్చల్, రంగారెడ్డి విద్యార్థులు సత్తాచాటారు. టాప్ 10లోనూ మన హైదరాబాద్ పేరు లేకపోవడం గమనార్హం.