News November 15, 2024

జూరాల ప్రాజెక్టు తాజా సమాచారం

image

ప్రియదర్శని జూరాల ప్రాజెక్టులో తాజా సమాచారం ఇలా ఉంది. శుక్రవారం ఉదయం నాటికి ప్రాజెక్టులో మొత్తం నీటి నిల్వ సమార్థ్యం 9.357 టీఎంసీలకు గానూ 5.650 టీఎంసీలు ఉన్నట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఇంజినీర్ నాగేశ్వరరావు తెలిపారు. నెట్టెంపాడుకు 609, ఎడమ కాలువకు 957, కుడికాలువకు 368 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం అవుట్ ఫ్లో 2,500 క్యూసెక్కులుగా వెళ్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 21, 2024

ఆత్మకూరుకు చేరిన కురుమూర్తి ఆభరణాలు

image

చిన్న చింతకుంట మండలం కురుమూర్తి స్వామికి అలంకరించిన ఆభరణాలను గురువారం ఆత్మకూరుకు తరలించారు. కురుమూర్తి జాతర సందర్భంగా 17 రోజుల క్రితం ఆత్మకూరు SBI బ్యాంకు నుంచి స్వామి వారి ఆభరాణాలు కురుమూర్తికి తరలించారు. జాతర ముగియడంతో తిరిగి నేడు ఆత్మకూరు SBI బ్యాంక్‌కు చేర్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ మదనేశ్వర్, ఆలయ కార్యదర్శి గోవర్ధన్, చిన్న చింతకుంట ఎస్సై శేఖర్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

News November 21, 2024

NRPT: మాగునూర్ ఘటన.. అధికారులపై సస్పెన్షన్ వేటు

image

మాగునూర్ ఘటనలో సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించగా ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది. హెచ్‌ఎం మురళీధర్‌రెడ్డి, ఇన్‌ఛార్జ్ హెచ్‌ఎం బాపురెడ్డి ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ కాంట్రాక్టును రద్దు చేశారు. బుధవారం (నిన్న) మధ్యాహ్న భోజనం వికటించి మాగనూర్ జడ్పీ పాఠశాలలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

News November 21, 2024

MBNR: విద్యార్థులను పరామర్శించిన కలెక్టర్

image

ఫుడ్ పాయిజన్‌కు గురై మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాగనూరు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఎటువంటి ఆందోళనకు గురి కాకూడదని ధైర్యం చెప్పారు. విద్యార్థులకు సరైన ఆహారం, వైద్యం అందించాల్సిందిగా సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.