News March 17, 2025

జూలపల్లి: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

image

పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల సుల్తానాబాద్ మైదానంలో పెద్దపల్లి జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో జూలపల్లి కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ తేలుకుంట విద్యార్థులు జి.మణిక్రాంత్, సాన్వి శ్రీ విద్యార్థులు 100mts, 400mts పరుగుపందెంలో పాల్గొని హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ, హెచ్ఎం, అభినందించారు.

Similar News

News March 18, 2025

‘బుడమేరు’కు శాశ్వత పరిష్కారం: మంత్రి

image

AP: గతేడాది విజయవాడను ముంచేసిన బుడమేరు వాగుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు ప్రారంభించామని మంత్రి నిమ్మల తెలిపారు. ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, నిధుల విడుదలకు మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు సరస్సు వరకు కాలువల ప్రవాహ మార్గం సామర్థ్యాన్ని 10వేల క్యూసెక్కులకు పెంచుతామన్నారు.

News March 18, 2025

భారత్ టెస్టుల్లో పేలవం.. రోహిత్‌దే బాధ్యత: గంగూలీ

image

టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో బాగా ఆడుతున్నా టెస్టుల్లో పేలవమేనని మాజీ క్రికెటర్ గంగూలీ అన్నారు. ‘కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్ బాధ్యత తీసుకోవాలి. టెస్టుల్లో రోహిత్ బ్యాటింగ్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతడి సామర్థ్యానికి మరింత మెరుగ్గా ఆడి ఉండాల్సింది. ఇంగ్లండ్‌తో ఆడనున్న టెస్టుల్లో గెలుపులపై రోహిత్ ముందుగానే ప్లాన్ వేయాలి. తెల్లబంతి ఫార్మాట్లలో మాత్రం అతడికి తిరుగులేదు’ అని కొనియాడారు.

News March 18, 2025

వరంగల్ మార్కెట్‌లో పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారంతో పోలిస్తే మంగళవారం మిర్చి ధరలు సైతం పెరిగాయి. తేజ మిర్చి క్వింటాకు నిన్న రూ.13,500 ధర రాగా.. నేడు రూ.13,650 పలికింది. 341 రకం మిర్చికి సోమవారం రూ.13,000 ధర రాగా ఈరోజు రూ. 13,100 ధర వచ్చింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చి క్వింటా నిన్న రూ.15,800 పలకగా ఈరోజు రూ.16 వేలు వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

error: Content is protected !!