News February 12, 2025

జేఈఈలో జిల్లా విద్యార్థుల ప్రతిభ

image

జేఈఈ మెయిన్ సెషన్-1లో అనంతపురం, సత్యసాయి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. అనంతపురానికి చెందిన నితిన్ అగ్నిహోత్రి 99.99 పర్సంటైల్, గాండ్లపెంట మండలం సోమామాజులపల్లికి చెందిన ఓం కిరణ్ 99.91, అనంతపురం అశోక్ నగర్‌కు చెందిన అసిఫ్ 99.48, అనంతపురానికి చెందిన భావ, విశాల్ 99.43, 99.36 పర్సంటైల్‌తో సత్తా చాటారు.

Similar News

News February 12, 2025

ర్యాగింగ్ భూతాలు: మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీసి…

image

కేరళ కొట్టాయం నర్సింగ్ కాలేజీలో దారుణం జరిగింది. తిరువనంతపురానికి చెందిన ముగ్గురు ఫస్టియర్ స్టూడెంట్స్‌ను ఐదుగురు థర్డ్ ఇయర్ సీనియర్లు ర్యాగింగ్ చేశారు. బట్టలిప్పించి వారి మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీశారు. అక్కడితో ఆగకుండా గాయాలకు కెమికల్స్ పూశారు. నొప్పి భరించలేక అరుస్తుంటే నోట్లోనూ స్ప్రే చేశారు. డబ్బులు దోచుకున్నారు. చంపేస్తామని బెదిరించినా తట్టుకోలేని స్టూడెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 12, 2025

త్వరలో రాజ్యసభకు కమల్‌ హాసన్!

image

మక్కల్ నీది మయ్యమ్ (MNM) అధినేత, సినీ స్టార్ కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. ఆయనతో పాటు మరొకరికీ అవకాశం ఉంటుందని తెలిసింది. 2024 లోక్‌సభ ఎన్నికలప్పుడు అధికార DMKతో MNM పొత్తు పెట్టుకుంది. బదులుగా కమల్‌ను రాజ్యసభకు పంపిస్తామని CM MK స్టాలిన్ హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని నేడు DMK మంత్రి ఒకరు, అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. MNM నుంచి మరొకరికీ అవకాశమిస్తామని పేర్కొన్నారు.

News February 12, 2025

HYD: కోర్ వైపు కష్టమే.. అంతా కంప్యూటర్ వైపే..!

image

HYD, RR, MDCL కాలేజీల్లో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్ తదితర కోర్ బ్రాంచీల్లో ఇంజినీరింగ్ సీట్లు భారీగా పడిపోతున్నాయి. విద్యార్థుల ఆలోచనను పసిగట్టి, కోర్ బ్రాంచీలు తీసేసి కంప్యూటర్ కోర్సుల వైపు కాలేజీలు మొగ్గు చూపుతున్నాయి.వచ్చే ఏడాదికి తమకు AI, కంప్యూటర్ సైన్స్ (CSE)లాంటి కోర్సులు నడిపేందుకు పర్మిషన్ కావాలని సుమారు 15కు పైగా కాలేజీలు దరఖాస్తులు పెట్టుకున్నాయి.

error: Content is protected !!