News March 17, 2025
జోగులాంబ గద్వాల జిల్లా ముఖ్య వార్తలు

జోగులాంబ :@ధరూర్ : LOC అందజేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల.
@ఇటిక్యాల :RTC బస్సులను నిలపాలని వినతి.
@ఉండవెల్లి : మారమునగాలలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.
@రాజోలి : యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేయాలి.
@అలంపూర్ : మటన్ షాపులకు భారీగా పెరిగిన విక్రయాలు.
@ జిల్లాలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
@అయిజ: స్నేహితుడి వైద్యానికి ఆర్థిక సహాయం అందించారు.
@గద్వాల : ప్రజా సమస్యలను పరిష్కరించండి.సిపిఎం
Similar News
News March 17, 2025
అనకాపల్లి: దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. నిలిచిన రైళ్లు

అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది. రాత్రి రైల్వే వంతెన కింద నుంచి వెళ్తున్న ఓ భారీ వాహనం గడ్డర్‌ను ఢీకొనడంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో కశింకోటలో గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లు, యలమంచిలిలో మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
News March 17, 2025
పాక్ మాజీ క్రికెటర్ల ఇంట్లో పట్టపగలే చోరీ

పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్‌కు చెందిన లాహోర్ ఫామ్‌హౌస్‌లో దొంగలు పడ్డారు. పట్టపగలే రూ.5లక్షల విలువైన సౌర విద్యుత్ పలకలను దోచుకెళ్లిపోయారు. ముందురోజే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, ఒకరోజు కూడా గడవకుండానే దొంగలు దోచేశారని అక్మల్ తండ్రి వాపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
News March 17, 2025
నేటి నుంచి ‘యువ వికాసం’ దరఖాస్తులు షురూ

TG: ‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తుల ప్రక్రియను సీఎం రేవంత్ నేడు ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 5వరకూ అప్లికేషన్లు స్వీకరించనున్నారు. నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం రూ.లక్ష నుంచి 3లక్షల వరకూ రుణాలు అందించనున్నారు. ఇందులో 60-80% వరకు రాయితీ ఉంటుంది. రూ.6 వేల కోట్లతో 5లక్షల మంది యువతకు రుణాలిచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దరఖాస్తుకు సైట్: tgobmms.cgg.gov.in