News April 7, 2025
జోగులాంబ గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

@గద్వాల జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి సందర్భంగా 37 ఫిర్యాదులు వెల్లువ @అయిజ మండలం యాపదిన్నె గ్రామంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పశు బల ప్రదర్శన బండ్ల గిరక పోటీలు @కేటిదొడ్డి మండలంలో సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ సరిత @ గద్వాల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిది అందజేత @రేషన్ దుకాణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టాలని బీజేపీ డిమాండ్.
Similar News
News April 17, 2025
నెల్లూరులో వ్యభిచారం గుట్టురట్టు

నెల్లూరులోని వ్యభిచార కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. బాపట్ల జిల్లాకు చెందిన మహిళ నెల్లూరు హరనాథపురం శివారులోని ఓ అపార్ట్‌మెంట్లో ఇంటిని రెంట్‌కు తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. పక్కా సమాచారంతో బాలాజీ నగర్ సీఐ సాంబశివరావు దాడి చేశారు. ఆమెతో పాటు విటుడు మహేశ్‌ను అరెస్ట్ చేశారు. ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు.
News April 17, 2025
ధర్మవరం రూట్‌లో పనులు.. పలు రైళ్లు రద్దు

ధర్మవరం రైల్వే స్టేషన్‌లో పుట్టపుర్తి-తిరుపతి కనెక్షన్ పాయింట్స్, పాయింట్ ఛేంజింగ్ పనులు బుధవారం మొదలయ్యాయి. దీంతో గుంతకల్లు-తిరుపతి, తిరుపతి-కదిరిదేవరపల్లి ప్యాసింజర్ రైళ్లు బుధవారం నుంచి మే 17వరకు రద్దయ్యాయి. ఈ మార్గంలో వెళ్లే మరిన్ని రైళ్లను గుత్తి మీదుగా రేణిగుంటకు మళ్లించారు. ఇక నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ కదిరి-నర్సాపూర్ మధ్య రాకపోకలు సాగించనుంది.
News April 17, 2025
సోషల్ మీడియాలో పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు: సీఐ

మహిళలను కించపరుస్తూ అసభ్యకరంగా ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్ పెట్టిన వైసీపీ నాయకుడిపై కేసు నమోదు చేసినట్లు మదనపల్లె రెండవ పట్టణ సీఐ రామచంద్ర తెలిపారు. మదనపల్లెలోని శివాజీ నగర్‌లో ఉండే మహబూబ్ ఖాన్ ఫిర్యాదు మేరకు ఎక్స్‌లో అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వైసీపీ నేతపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.