News January 26, 2025

టికే ఆర్ శర్మ సేవలు చిరస్మరణీయం: డీవీఆర్

image

గాంధీయవాది టీకేఆర్ శర్మ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని క్లస్టర్ యూనివర్సిటీ ఉపకులపతి డీవీఆర్ సాయి గోపాల్ అన్నారు. శనివారం యూనివర్సిటీ ప్రాంగణంలో టీకేఆర్ శర్మ శతజయంతి ఉత్సవాల బ్రోచర్లను ఆయన విడుదల చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. శత జయంతి ఉత్సవాలను ఈనెల 30న కర్నూలులోని కేవీఆర్ కళాశాల ప్రాంగణంలో గాడిచర్ల ఫౌండేషన్, సాహితీ సదస్సు సంస్థ సంయుక్తా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు.

Similar News

News January 27, 2025

BREAKING: కర్నూలు జిల్లాలో ఇద్దరు గురుకుల విద్యార్థుల కిడ్నాప్

image

సీ.బెళగల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ గురుకుల రెసిడెన్షియల్ స్కూలులో 6వ తరగతి చదువుతున్న సూర్యతేజ, 7వ తరగతికి చెందిన నవీన్ అనే విద్యార్థులు సోమవారం కిడ్నాప్‌‌నకు గురైనట్లు తెలుస్తోంది. గుర్తుతెలియని దుండగులు పిల్లలను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థుల ఆచూకీ తెలిస్తే మండల ఎస్ఐ నంబర్ 9121101073కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

News January 27, 2025

కర్నూలులో 30న వైసీపీ జిల్లా కార్యవర్గ సమావేశం

image

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 30న గురువారం ఉదయం 10 గంటలకు కర్నూలులో శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ (బిర్లా కాంపౌండ్)లో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్‌వీ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా వైసీపీ కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీల సభ్యులు తప్పక హాజరు కావాలని పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధిపై చర్చిస్తామని తెలిపారు.

News January 27, 2025

కర్నూలులో కలెక్టర్ అర్జీల స్వీకరణ.. ఎస్పీ కార్యక్రమం రద్దు

image

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నేడు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పీజీఆర్‌లో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అన్ని మండల కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగనుంది
➤ మరోవైపు పోలీస్ కార్యాలయంలో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య ఎంపికలు ఉన్నందున రద్దు చేసినట్లు చెప్పారు.