News April 4, 2025
టీ.నర్సాపురం: ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

టీ.నర్సాపురం మండలం జగ్గవరం గ్రామానికి చెందిన కొక్కుల సోమేశ్వరరావు(60) గుండెపోటుతో బస్సులో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ భార్యను వెంటబెట్టుకొని జగ్గవరం నుంచి బస్సులో హాస్పటల్‌కి బయలుదేరారు. మార్గమధ్యలో రాజు పోతేపల్లి సెంటర్ వద్దకు వచ్చేసరికి ఆయనకు గుండెపోటుతో రావడంతో మృతి చెందారు. తన భుజంపై ప్రాణాలు విడిచిన భర్తను చూసి భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు.
Similar News
News April 18, 2025
మరోసారి మొబైల్ టారిఫ్స్ పెంపు?

టెలికాం కంపెనీలు మరోసారి మొబైల్ టారిఫ్స్ పెంచబోతున్నట్లు మనీకంట్రోల్ తెలిపింది. ఈ ఏడాది చివర్లో 10-20% పెంపు ఉండబోతున్నట్లు పేర్కొంది. నవంబర్-డిసెంబర్ నెలల్లో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు రీఛార్జ్ ధరల పెంపును ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించింది. ARPU వృద్ధి, మూలధనంపై మెరుగైన రాబడి కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా గత జులైలోనే టెలికామ్ సంస్థలు టారిఫ్లను పెంచాయి.
News April 18, 2025
క్రికెటర్లు అసభ్య ఫొటోలు పంపేవారు: అనయా

తనకు కొందరు క్రికెటర్లు న్యూడ్ ఫొటోలు పంపేవారని టీమ్ ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ కూతురు అనయా తెలిపారు. ఓ సీనియర్ క్రికెటర్ తనతో బెడ్ పంచుకోవాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. తోటివారితో ఎన్నో అవమానాలకు గురైనట్లు వెల్లడించారు. కాగా బంగర్ కుమారుడు ఆర్యన్ లింగమార్పిడి చేయించుకుని అనయాగా మారారు. అంతకుముందు యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్‌లతో కలిసి ఆయన క్రికెట్ ఆడారు.
News April 18, 2025
వరంగల్: భద్రకాళి చెరువులోని మట్టి కావాలా?

వరంగల్ భద్రకాళి చెరువు పూడికతీతలో భాగంగా నల్లమట్టి కావాల్సిన వారు నక్కలగుట్ట ఇరిగేషన్ సర్కిల్-2 కార్యాలయంలో సంప్రదించాలని ఈఈ శంకర్ తెలిపారు. ఒక క్యూబిక్ మీటరు మట్టికి రూ.71.83 డీడీ తీసి కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇతర వివరాల కోసం సహాయ కేంద్రం నంబర్ 94406 38401ను సంప్రదించాలన్నారు. నల్లమట్టి పంట పొలాలకు ఎరువులా ఉపయోగపడుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.