News June 29, 2024
టీటీడీ సేవలకు ఆధార్ అనుసంధానం..?
టీటీడీ ఆన్‌లైన్ సేవలకు ఆధార్ లింక్ చేసేలా అడుగులు పడుతున్నాయి. ఇదే విషయమై ఈవో శ్యామలరావు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో UIDAI అధికారులతో సమావేశమయ్యారు. ‘టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలను ఆన్‌లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ దళారుల బెడద తప్పడం లేదు. ఆధార్ లింక్ ద్వారా మోసాలను అరికట్టేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి’ అని టీటీడీ ఐటీ అధికారులకు ఈవో సూచించారు.
Similar News
News December 21, 2024
రామసముద్రం: హౌసింగ్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి
రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీలోని హౌసింగ్ లేఔట్ ను శనివారం హౌసింగ్ డిఈ రమేష్ రెడ్డి, ఎంపీడీవో భానుప్రసాద్ పరిశీలించారు. పెండింగులో ఉన్న గృహనిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని డీఈ సూచించారు. పునాదులు, గోడల వరకు ఉన్న ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసినట్లయితే వెంటనే బిల్లులు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు.
News December 21, 2024
కుప్పానికి రూ.451 కోట్లు.. జీవో ఇచ్చి మళ్లీ రద్దు
CM చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అభివృద్ధికి ప్రభుత్వం స్పెషల్ గ్రాంట్ కింద రూ.456 కోట్లు మంజూరు చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. కుప్పం పరిధిలో 130 KM మేర అండర్ డ్రైనేజ్, 11 అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగించాలని ఆదేశించింది. నిన్న రాత్రే ఈ జీవోను రద్దు చేసింది. పనుల్లో కొన్ని మార్పులు చేసి మరోసారి జీవో ఇస్తారని సమాచారం.
News December 21, 2024
త్వరలో ‘టైమ్స్ ఆఫ్ చిత్తూరు’ సినిమా
తాను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చిత్తూరు ఎలా ఉందనే అంశంపై సినిమా తీస్తున్నట్లు MLA జగన్ మోహన్ ప్రకటించారు. ఇందులో వివిధ పార్టీల రాజకీయ నాయకుల ప్రస్తావన ఉంటుందని చెప్పారు. ‘టైమ్స్ ఆఫ్ చిత్తూరు’ పేరిట వచ్చే ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. పాత్రలు, స్వభావాలు అంటూ ఇందులో సీకే బాబు, బుల్లెట్ సురేశ్, విజయానందరెడ్డి తదితరుల పేర్లతో కూడిన పోస్టర్లు ఆసక్తి రేపుతున్నాయి.