News April 10, 2024
టీడీపీలో చేరిన మంత్రి అంబటి బంధువు

బాపట్లకు చెందిన వివేకా సర్వీస్ సొసైటీ కార్యదర్శి, మంత్రి అంబటి రాంబాబు బంధువు అంబటి మురళీకృష్ణ టీడీపీలో చేరారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మురళీకృష్ణకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబటి మురళీకృష్ణ 1989 నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. 2010 ఓదార్పు యాత్రలో వెదుళ్లపల్లిలోని తన కార్యాలయంలో వైఎస్ జగన్‌కు బస ఏర్పాటు చేశారు.
Similar News
News April 11, 2025
కొల్లిపర: బాలికపై అత్యాచారయత్నం. 20ఏళ్ల జైలు శిక్ష

కొల్లిపురం మండలం దావులూరుకి చెందిన పి. సురేశ్ (53) 4ఏళ్ల బాలికపై 2021లో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పటి కొల్లిపర ఎస్ఐ బలరామిరెడ్డి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన దిశా ఎస్ఐ సంజయరాణి ఆధారాలు సమర్పించగా, తెనాలి పోక్సో కోర్టు న్యాయమూర్తి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించారు.
News April 11, 2025
గోరంట్ల మాధవ్‌పై తాడేపల్లిలో కేసు నమోదు

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్‌పై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ మేరకు గురువారం తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు మాట్లాడుతూ.. గోరంట్ల మాధవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు.
News April 10, 2025
జూలకల్లులో వైసీపీ నేతపై దాడి

ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని జూలకల్లులో వైసీపీ నేత పాశం చిన్న అంజిరెడ్డిపై గురువారం కొందరు మూకుమ్మడిగా దాడి చేశారు. కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. కుటుంబసభ్యులు ఆయన్ని పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.