News March 23, 2025
టీబీ విభాగంలో భద్రాద్రికి రెండో బహుమతి

రాష్ట్ర స్థాయిలో క్షయ విభాగంలో ఉత్తమ సేవలందించినందుకు 2024 ఏడాదికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాష్ట్రస్థాయిలో రెండో బహుమతి లభించింది. శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ రిజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ, రాష్ట్ర క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ రాజేశం చేతుల మీదుగా డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయక్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ బాలాజీ అవార్డు అందుకున్నారు.
Similar News
News March 28, 2025
NZB: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ

NZB నగర శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది. మహిళ మృతదేహాన్ని కారు డిక్కీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మృతురాలు కమలగా పోలీసులు గుర్తించారు. కంఠేశ్వర్ బైపాస్ వద్ద మహిళను హత్య చేసి, మాక్లూర్‌లోని దాస్ నగర్ కెనాల్‌లో పడేసేందుకు కారు డిక్కీలో మృతదేహాన్ని తరలిస్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 28, 2025
నక్కపల్లి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన RI

నక్కపల్లిలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయి. గత కొంతకాలం నుంచి ఈ కార్యాలయంపై అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొలంలో బోరు కోసం ఒక రైతు నుంచి రూ.12 వేలు లంచం డిమాండ్ చేస్తూ ఆర్ఐ కన్నబాబు శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఆర్‌ఐ కన్నబాబును అరెస్ట్ చేశారు.
News March 28, 2025
ప్రణాళికాబద్ధంగా ప్యాక్స్ పని చేయాలి: ఖమ్మం కలెక్టర్

ప్రణాళికాబద్ధంగా ప్యాక్స్ పని చేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్యాక్స్‌లో ఉన్న సభ్యులు యాక్టివ్‌గా ఉండేలా చూడాలని చెప్పారు. అటు ప్యాక్స్ రైతులకు ఉపయోగపడే నూతన కార్యక్రమాలను చేపట్టేలా ప్రణాళిక చేయాలన్నారు.