News December 25, 2024

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో శిశువు మృతి

image

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో బుధవారం వేకువజామున మగ శిశువు మృతిచెందాడు. నందిగాం మండలం కైజోల గ్రామానికి చెందిన శ్రావణి డెలివరీకి అడ్మిట్ అయ్యారు. బుధవారం వేకువజామున పురిటినొప్పులు అధికం కావడంతో సాధారణ కాన్పులో బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే అస్వస్థతకు గురైన శిశువు కొద్దిసేపటికి మృతిచెందింది. శిశువు మృతికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణమని బంధువులు ఆసుపత్రిలో నిరసన తెలిపారు.

Similar News

News December 26, 2024

SKLM: పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

image

సంక్రాంతి సీజన్ సందర్భంగా పలు రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డీఆర్ఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ-గుణపూర్-విశాఖ ప్యాసింజర్ స్పెషల్‌కు జనవరి ఒకటి నుంచి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను జత చేస్తున్నారన్నారు. భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు జనవరి 4 నుంచి 25 వరకు, తిరుగూ ప్రయాణంలో జనవరి 5 నుంచి 26 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను జత చేస్తున్నట్లు తెలిపారు.

News December 26, 2024

మందస: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

image

శ్రీకాకుళం జిల్లా మందస మండలం పితాతొలి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పలాస నుంచి మందసకు వెళ్తుండగా బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో సొండిపూడి లైన్ మేన్ జోగారావుతో పాటు మరో యువకుడు కిరణ్‌కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆసుపత్రికి తరలించారు.

News December 26, 2024

సిక్కోలుకు భారీ వర్షసూచన

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిన నేపథ్యంలో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు విశాఖ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఓడ రేవుల్లో మూడో ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీచేశారు.