News March 20, 2025
టెన్త్ పరీక్షలు.. జిరాక్స్ సెంటర్ల బంద్ చేయాలి: వరంగల్ సీపీ

పదో తరగతి పరీక్షల సందర్భంగా పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో పరీక్ష కేంద్రాల సమీపంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉండవద్దని సీపీ సన్ ప్రీత్ సింగ్ అదేశించారు. ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్ల వద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా జాగ్రత్త పడాలన్నారు. ముఖ్యంగా పరీక్ష కేంద్ర పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News March 28, 2025
చాట్ జీపీటీని దాటేసిన గ్రోక్

ఎలాన్ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బోట్ ‘గ్రోక్’ సంచలనం సృష్టిస్తోంది. అమెరికా గూగుల్ ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ టాప్ ఫ్రీ లిస్టులో అగ్రస్థానానికి చేరింది. ఈ క్రమంలో గ్రోక్.. చాట్ జీపీటీ, టిక్‌టాక్‌ను దాటేసినట్లు మస్క్ ట్వీట్ చేశారు. గ్రోక్ ఆండ్రాయిడ్ యాప్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అందుబాటులోకి వచ్చింది.
News March 28, 2025
ఏలూరు: ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్

సర్వ మానవాళి సుఖ సంతోషాలు రంజాన్ ప్రార్ధనల ముఖ్య ఉద్దేశ్యం అని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. స్థానిక గిరిజన భవన్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ‘ఇఫ్తార్’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, రంజాన్ మాసంలో చేసే ఉపవాస దీక్ష ద్వారా మానసిక, శారీరక పవిత్రత చేకూరుతుందన్నారు.
News March 28, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

జడ్చర్ల:నీటి సంపులో మహిళ మృతదేహం
రేపు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాక
కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు
ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు
ఘనంగా “షబ్ -ఏ -ఖదర్” వేడుకలు
అందరికీ రుణమాఫీ చేయండి:BJP
గుడ్ న్యూస్ ఉగాదికి సన్నబియ్యం
పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
రంజాన్ వేళ..ఈద్గా వద్ద ఏర్పాట్లు
GWL:కాల్వకు నీళ్లు రాకపోతే చావే శరణ్యం
అమ్రాబాద్: తండ్రి మృతి పుట్టెడు దు:ఖంలో టెన్త్ ‘పరీక్ష’