News March 13, 2025
ట్యాంక్ పైనుంచి దూకి యువకుడి సూసైడ్

సంజామల మండలం ఎగ్గోనిలో తాగునీటి సరఫరా కోసం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ పైనుంచి దూకి యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా ముద్దనూరు మండలం ఉప్పలూరుకు చెందిన కర్నాటి హర్షవర్ధన్ రెడ్డి(30) ఎగ్గోనిలోని తన సోదరి ఇంటికి 2 రోజుల క్రితం వచ్చాడు. అయితే మద్యానికి బానిసగా మారి, ఆరోగ్యం చెడిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 14, 2025
అశ్వారావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం

అశ్వారావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తిరుమలకుంట గ్రామ శివారు ఆంజనేయస్వామి గుడి దగ్గర రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓవ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 14, 2025
వేమనపల్లిలో పండగ పూట విషాదం

మంచిర్యాల జిల్లాలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేమనపల్లి మండలానికి చెందిన కంపెల రాజ్ కుమార్ (20) శుక్రవారం హోలీ ఆడిన తర్వాత స్నేహితులతో కలిసి ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు.
News March 14, 2025
బాపులపాడులో రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం వద్ద చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.