News January 8, 2025
ట్రాక్టర్ కింద పడి నంద్యాల జిల్లా వ్యక్తి మృతి
అనంతపురం జిల్లాలో ట్రాక్టర్ కింద పడి నంద్యాల జిల్లా వ్యక్తి మృతి చెందారు. అందిన వివరాల మేరకు.. అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన వెంకట చరణ్ రెడ్డి ట్రాక్టర్‌లో నంద్యాల నుంచి ధర్మవరానికి వెళ్తున్నారు. అతడు డ్రైవర్ పక్కన కూర్చోగా ముచ్చుకోట వద్ద ఘాట్ రోడ్డులో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దపప్పూరు పోలీసులు తెలిపారు.
Similar News
News January 9, 2025
కర్నూలు: పోక్సో కేసులో మూడేళ్లు జైలు శిక్ష
పదేళ్ల బాలికకు అసభ్యకర ఫొటోలు చూపిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కర్నూలు బుధవారపేటకు చెందిన బొగ్గుల రాజేశ్‌కు జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు మూడేళ్లు జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు 2021 జూన్‌లో కర్నూలు మూడో పట్టణ పోలీసు స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి పై విధంగా తీర్పునిచ్చారు.
News January 9, 2025
ఇస్తేమా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
ఆత్మకూరు కేంద్రంగా 3 రోజుల పాటు జరిగిన ఇస్తేమా కార్యక్రమంలో భాగంగా చివరి రోజైనా గురువారం వేడుక ముగుస్తున్న సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రత్యేకించి ట్రాఫిక్ సమస్య వాటిల్లకుండా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
News January 9, 2025
పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన రద్దు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేటి కర్నూలు జిల్లా పర్యటన రద్దయింది. తిరుపతి బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆయన జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. త్వరలోనే మళ్లీ జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది.