News April 4, 2025
ట్రాక్టర్‌లకు జీపీఎస్ ఖచ్చితంగా ఉండాలి: జనగాం కలెక్టర్

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక తరలింపులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ట్రాక్టర్‌లకు జీపీఎస్ ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు. ఏ గ్రామానికి ఇసుకను తరలిస్తున్నారో ఆ రాకపోకలకు సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయంలోని రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.
Similar News
News April 11, 2025
సిద్దిపేట: ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పరిశీలించిన మంత్రులు

సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభానికి సన్నద్ధం అయిందన్న మంత్రులు ప్రకటించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ నర్మెట్ట లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పరిశీలించామని, త్వరలోనే ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని తెలిపారు.
News April 11, 2025
ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో: సీఎం రేవంత్

TG: ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. మెట్రో రెండో దశ విస్తరణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష తీశారు. మొత్తం 76.4KMల విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం DPR పంపింది. కేంద్రం నుంచి పర్మిషన్ రాగానే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
News April 11, 2025
పీరియడ్స్ వచ్చాయని బయట కూర్చోబెట్టి పరీక్ష.. నటి ఫైర్

తమిళనాడులో నెలసరి బాలికను <<16051110>>తరగతి గది బయట<<>> కూర్చోబెట్టి పరీక్ష రాయించిన ఘటనపై నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఫైరయ్యారు. ‘ఈ ఘటన విచారకరం. నన్ను షాక్‌కు గురిచేసింది. మనం ఏ యుగంలో బతుకుతున్నాం? ఇలాంటి పనులు చేస్తున్నందుకు సిగ్గుగా లేదా?’ అని స్కూల్ సిబ్బందిని దుయ్యబట్టారు. నెలసరి అనేది సహజమని, మానసికంగా ఎదుగుదల లేని అధికారులకు బుద్ధి చెప్పాలని మండిపడ్డారు.