News March 20, 2025

ట్రాన్స్‌జెండర్ హత్య.. ప.గో జిల్లా వాసి అరెస్ట్

image

అనకాపల్లి జిల్లాలో దీపు అనే ట్రాన్స్‌జెండర్ హత్య కలకలం రేపింన విషయం తెలిసిందే. అయితే ఇరగవరం(M) పొదలాడకు చెందిన బన్నీనే ఆ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నాలుగేళ్ల నుంచి ఆమెతో సహజీవనం చేస్తూ..గొడవలు రావడంతో హత్య చేసినట్లు సమాచారం. కశింకోట మండలం బయ్యవరంలో హంతకుడు ఆమె నడుము కింది భాగం, కాలు, చేయి మూట కట్టి పడేశాడు. దీంతో జిల్లా ఇన్‌ఛార్జ్ SP వకుల్ జిందాల్ 8 టీమ్‌లతో దర్యాప్తు చేసి కేసు చేధించారు.

Similar News

News March 21, 2025

ఆకివీడు: స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి

image

ఆకివీడు మండలం చిన కాపవరంలోని వయ్యేరు కాలువలో శుక్రవారం స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. 5వ తరగతి చదువుతున్న పడికౌరు శరత్‌కుమార్ (10) కటారి పవన్ సాయి (10)లు మధ్యాహ్నం సమయంలో ఈతకొట్టేందుకు కాలువలోకి దిగారు. ఇద్దరు ఒక్కసారిగా కాలువలో మునిగిపోయారు. వీరి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

News March 21, 2025

ప.గో జిల్లాలో ఉగాది పురస్కారాలకు ఎంపికైన అధికారులు

image

పశ్చిమగోదావరి జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ HC అప్పారావు, DAR ARPC వెంకట రామకృష్ణ, పాలకొల్లు ఫైర్ ADFO జానకిరామ్, తణుకు టౌన్ PS HC నరసింహారాజు, జిల్లా ARSI నాగేశ్వరరావు. కొవ్వూరు డివిజన్ లోని ఉండ్రాజవరం PS ASI రామకృష్ణ, చాగల్లు PS ASI రాజేంద్రప్రసాద్‌లు ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారని అధికారులు తెలిపారు.

News March 21, 2025

ప.గో జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

image

ప.గో జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో పల్లెల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కాగా భీమవరంలో గురువారం 36.54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గణపవరంలో ఇవాళ దాదాపు 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

error: Content is protected !!