News March 17, 2025

డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్  అరెస్ట్

image

కదిరి అమృతవల్లి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటపతిని అరెస్ట్ చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. వెంకటపతికి కౌన్సిలింగ్ ఇచ్చి కోర్ట్‌‌లో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సదరు కాలేజి ప్రిన్సిపల్ వెంకటపతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సీఐ తెలిపారు.

Similar News

News March 17, 2025

అనకాపల్లి: దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. నిలిచిన రైళ్లు

image

అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది. రాత్రి రైల్వే వంతెన కింద నుంచి వెళ్తున్న ఓ భారీ వాహనం గడ్డర్‌ను ఢీకొనడంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో కశింకోటలో గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లు, యలమంచిలిలో మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

News March 17, 2025

పాక్ మాజీ క్రికెటర్ల ఇంట్లో పట్టపగలే చోరీ

image

పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్‌కు చెందిన లాహోర్‌ ఫామ్‌హౌస్‌లో దొంగలు పడ్డారు. పట్టపగలే రూ.5లక్షల విలువైన సౌర విద్యుత్ పలకలను దోచుకెళ్లిపోయారు. ముందురోజే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, ఒకరోజు కూడా గడవకుండానే దొంగలు దోచేశారని అక్మల్ తండ్రి వాపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

News March 17, 2025

నేటి నుంచి ‘యువ వికాసం’ దరఖాస్తులు షురూ

image

TG: ‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తుల ప్రక్రియను సీఎం రేవంత్ నేడు ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 5వరకూ అప్లికేషన్లు స్వీకరించనున్నారు. నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం రూ.లక్ష నుంచి 3లక్షల వరకూ రుణాలు అందించనున్నారు. ఇందులో 60-80% వరకు రాయితీ ఉంటుంది. రూ.6 వేల కోట్లతో 5లక్షల మంది యువతకు రుణాలిచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దరఖాస్తుకు సైట్: tgobmms.cgg.gov.in

error: Content is protected !!