News March 20, 2025

డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయండి: కలెక్టర్

image

ఈ నెల 22న డిప్యూటీ సీఎం జిల్లాకు రానున్నారని, అందుకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేసి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామ పరిధిలో ఉన్న రైతు పొలంలో ఫారంపాండ్‌కు భూమిపూజ చేయనున్నారు. తదుపరి బహిరంగ సభలో పాల్గొననున్న సందర్భంగా ఎస్పీతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

Similar News

News March 28, 2025

‘కిలోకి రూ.10 కమీషన్’ నిరూపిస్తే ఆస్తులు రాసిస్తా: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే

image

కర్నూలులోని ‘సాక్షి’ ఆఫీస్ ముందు ధర్నాకు దిగిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వైసీపీకి సవాల్ విసిరారు. ‘చికెన్ షాపుల నుంచి మేము కిలోకు రూ.10 తీసుకుంటున్నట్లు నిరూపిస్తే నా ఆస్తులు రాసిస్తా. లేదంటే నాపై రాసిన వార్తలన్నీ తప్పని ప్రచురించాలి. నాపై ఇలాంటి వార్తలు రాయడం తగదు’ అంటూ ఆమె హెచ్చరించారు. కాగా నిన్న సాక్షి కార్యాలయం ముందు కోళ్ల వ్యర్థాలు, చెత్త పడేసి ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

News March 28, 2025

2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు

image

ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైలంలో 800 సీసీ కెమెరాలు, 3 డ్రోన్లతో పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పర్యవేక్షణలో ఆరుగురు DSPలు, 40 మంది సీఐలు, 100 మంది ఎస్ఐలు, 1,500 సివిల్ పోలీస్ సిబ్బంది, 200 మంది ఆర్మ్‌డ్, 200 మంది APSP, 100 మంది స్పెషల్ పార్టీ మొత్తంగా 2 వేలకు పైగా సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 31 వరకు ఉత్సవాలు జరగనున్నాయి.

News March 28, 2025

విద్యార్థులకు ప్రతి గంటకు వాటర్ బెల్: డీఈవో

image

పత్తికొండ రెవెన్యూ డివిజన్‌లో పాఠశాలల విద్యార్థులకు ప్రతి గంటకు వాటర్ బెల్ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ యాజమాన్యాన్ని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు ఎండవేడిమికి గురికాకుండా శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూడాలని అన్నారు. ప్రతి విద్యార్థి తగినంత మంచినీటిని తాగేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.

error: Content is protected !!