News June 11, 2024

డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ దరఖాస్తుల ఆహ్వానం

image

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఐఈఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సుల్లో చేరేందుకు డీఈఈసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైందని ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రిన్సిపల్ సామినేని సత్యనారాయణ సోమవారం తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 30 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్లో 50 శాతం మార్కులు కలిగి ఉండాలని చెప్పారు.

Similar News

News December 14, 2025

ఖమ్మం: రెండో విడత.. ఖాతా తెరిచిన కాంగ్రెస్

image

కామేపల్లి మండలం పొన్నెకల్లు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ భూమిక గెలుపొందారు. సమీప అభ్యర్థిపై ఆమె 603 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భూమిక గెలుపు పట్ల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గింజల నర్సింహారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. తనను గెలిపించిన ఓటర్లకు భూమిక కృతజ్ఞతలు తెలిపారు.

News December 14, 2025

ఖమ్మం జిల్లాలో ‘కిక్’ ఎక్కిస్తోన్న జీపీ ఎన్నికలు..!

image

ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం మధ్య, గత 13 రోజుల్లో వైరా డిపో నుంచి రూ. 130 కోట్ల విలువైన 1.59 లక్షల కేసుల మద్యం, 56 వేల కేసుల బీర్లు తరలించారు. ఎన్నికల పుణ్యమా అని రికార్డు స్థాయిలో అమ్మకాలు జరగడంతో అటు వ్యాపారులకు, ఇటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది.

News December 13, 2025

ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకే ‘కల్చరల్ ఫెస్ట్’: ఛైర్మన్ శ్రీధర్

image

ఖమ్మం శ్రీచైతన్య కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్-2025 వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ అధ్యక్షత వహించగా, CBI మాజీ జేడీ VV లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈఉత్సవాలు ఒత్తిడిని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకేనని ఛైర్మన్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌లో ప్రధాని నుంచి పురస్కారం అందుకున్న కళాశాల విద్యార్థిని పల్లవిని ఈ సందర్భంగా సత్కరించారు.