News December 15, 2024

డిసెంబర్ 17న HYD రానున్న రాష్ట్రపతి

image

డిసెంబర్ 17న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శీతకాల విడిదికి HYD రానున్నారు. డిసెంబర్ 17 నుంచి 21 వరకు ఇక్కడే ఉంటారు. HYD మల్కాజ్గిరి జిల్లాలో తన పర్యటన కొనసాగనున్న నేపథ్యంలో కలెక్టర్ గౌతమ్ అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల సమన్వయంతో రాష్ట్రపతి పర్యటన విజయవంతం చేయాలన్నారు.

Similar News

News January 18, 2025

HYD: ఇంటర్ విద్యార్థుల ALERT.. ఈనెల 25 వరకు అవకాశం

image

ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ విద్యార్థుల‌ను ఇంటర్మీడియ‌ట్ బోర్డు అప్ర‌మ‌త్తం చేసింది. వార్షిక ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫీజును ఇప్ప‌టికీ చెల్లించ‌ని విద్యార్థులు.. ఆల‌స్య రుసుం రూ. 2500తో జ‌న‌వ‌రి 25 వ‌ర‌కు చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ఇంట‌ర్ రెగ్యుల‌ర్, వొకేష‌న‌ల్ విద్యార్థుల‌తో పాటు ప్రైవేటు విద్యార్థులు కూడా ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించింది.

News January 18, 2025

HYD: రాష్ట్రంలో రేవంత్ దోపీడీ ముఠా: కేటీఆర్

image

రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దోపీడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతుందని మాజీమంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రగతి భవన్‌లో చిట్ చాట్‌లో KTR మాట్లాడుతూ.. రేవంత్ సోదరులతో పాటు ఆరుగురి టీం కంపెనీల నుంచి వసూళ్ల కోసం రేవంత్ రెడ్డి తిప్పుతున్నాడని అన్నారు. తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోనిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏవి రెడ్డితో కూడిన ఆలీబాబా అర డజన్ దొంగల గ్యాంగ్ తెలంగాణలో తిరుగుతుందని అన్నారు.

News January 17, 2025

రంగారెడ్డి : హైదరాబాద్‌లో తగ్గిన వాయు కాలుష్యం

image

సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ వాసులంతా సొంతూళ్లకు వెళ్లారు. దీంతో నగరంలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా నివాస వాణిజ్య ప్రాంతాల్లో కాలుష్య కారకాలు గణనీయంగా తగ్గిపోగా.. పారిశ్రామిక వాడల్లో మాత్రం కాస్త అధికంగా నమోదైందన్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ ముగియడంతో మళ్లీ హైదరాబాదులో కాలుష్యం గణనీయంగా పెరిగిపోతుందని అధికారులు పేర్కొన్నారు.