News October 8, 2024
డిసెంబర్‌లో విశాఖ రైల్వేజోన్‌కు శంకుస్థాపన..!
కేంద్ర రైల్వే మంత్రి, సీఎం చంద్రబాబు భేటీలో విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. డిసెంబరు కల్లా కొత్త రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. విభజన హామీలో భాగంగా వాల్తేరు డివిజన్‌ను యథావిధిగా ఉంచాలని కోరినట్లు సమాచారం. అలాగే విశాఖ-అమరావతి మధ్య కొత్త రైల్వేలైన్ ఏర్పాటు, నమోభారత్ కింద విశాఖ-నెల్లూరు మధ్య రైలు అనుసంధానం మెరుగుపరచాలని కోరారు.
Similar News
News December 22, 2024
రైవాడ అందాలను ‘క్లిక్’మనిపించిన పవన్ కళ్యాణ్
రైవాడ జలాశయ అందాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఫోన్‌లో చిత్రీకరించారు. బల్లగరువు బహిరంగ సభకు వెళ్లే క్రమంలో రైవాడ జలాశయ అందాలను తిలకించేందుకు జీనబాడు – కోలపర్తి సమీపంలో పవన్ కళ్యాణ్ కారు దిగి ఆ ప్రాంతంలో అందాలను ఆస్వాదించారు. ఈ సందర్భంలో ఫోన్లో ఆ సుందరమైన కొండల మధ్యలో జలాశయ అందాలను బంధించారు.
News December 22, 2024
జీవీఎంసీలో స్టాండింగ్ కౌన్సిల్ నియామకాలకు నోటిఫికేషన్
జీవీఎంసీ తరపున స్టాండింగ్ కౌన్సిల్‌లో నియమించుటకు న్యాయవాదుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.8 మంది న్యాయవాదులు నియామకం నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేసారు.బార్ కౌన్సిల్స్ లో కనీసం 10 సంవత్సరాల మెంబర్‌గా రిజిస్ట్రేషన్ అయిన వారు మాత్రమే అర్హులని తెలిపారు.ఆసక్తి గలవారు జనవరి 6 లోపు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలన్నారు.
News December 22, 2024
గంజాయి స్మగ్లింగ్ ద్వారా ఆస్తులు సంపాదించడం నేరం: డీఐజీ
గంజాయి స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన ఆస్తులు కొనుగోలు చేయడం నేరం అని డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దోషులుగా ఉన్న వ్యక్తుల నుంచి ఆస్తులు కొనుగోలు చేయడం గానీ, డబ్బు చెలామణి జరిగినట్టు రుజువు ఐతే జప్తు చేయబడుతుందన్నారు. లావాదేవీలు జరిపే వారి పై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.