News June 29, 2024

డైట్‌లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్: ప్రిన్సిపల్

image

డైట్లో డిప్లమో కోర్స్ ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌కు ఈనెల 30 నుంచి జూలై 4 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చని భీమిలి డైట్ ప్రిన్సిపాల్ ఎం.జ్యోతి కుమారి తెలిపారు. మొదటి విడత వెబ్‌ఆప్షన్స్ ఇవ్వనివారు, మొదటి విడతలో సీటు రానివారు.. ఈ అవకాశం వినియోగించుకోవచ్చని చెప్పారు. వీరికి జూలై 5 నుంచి ఏడో తేదీ వరకు సీట్లు కేటాయింపు ఉంటుందని, జూలై 9 నుంచి 13 వరకు ప్రవేశాలు కల్పిస్తామని జ్యోతికుమారి తెలిపారు.

Similar News

News September 21, 2024

విశాఖ ఉక్కు కర్మాగారానికి ఊరట

image

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఊరట లభించింది. ముడి పదార్థాల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకున్న దీనికి మరో రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే గురువారం రూ.500 కోట్లు మంజూరు చేయడం తెలిసిందే. మొదట విడుదల చేసిన నిధులను కేవలం చట్టబద్ధమైన చెల్లింపులకే వినియోగించాలని షరతు పెట్టింది. ఆ నిధుల వినియోగం బాధ్యత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు అప్పగించింది.

News September 21, 2024

విశాఖ: 51 మంది వీఆర్వోలకు బదిలీలు

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్రేడ్-2 వీఆర్వోలకు విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. బదిలీల కోసం మొత్తం 234 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 51 మందికి బదిలీలు నిర్వహించినట్లు డీఆర్ఓ తెలిపారు.

News September 21, 2024

ఎస్.రాయవరంలో గురజాడ జయంతికి ఏర్పాట్లు

image

మహాకవి గురజాడ వేంకట అప్పారావు జయంతి నిర్వహించేందుకు ఆయన జన్మస్థలమైన ఎస్.రాయవరం గ్రామంలో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే గ్రామంలో ఉన్న గురజాడ విగ్రహానికి రంగులు వేసి సుందరంగా తీర్చి దిద్దారు. ఈ సందర్భంగా గ్రామంలో శుక్రవారం, శనివారం గురజాడ జయంతి వేడుకలు జరుపుతామని గురజాడ ఫౌండేషన్ సభ్యుడు బొలిశెట్టి గోవిందరావు తెలిపారు.