News February 2, 2025

డోర్నకల్: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

image

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సోమేశ్వరరావు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సహచర కానిస్టేబుల్ మృతిపై డోర్నకల్ పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Similar News

News February 2, 2025

ట్యాక్స్ రిలీఫ్ వల్ల వినియోగం, పొదుపు పెరుగుతాయి: నిర్మల

image

మిడిల్ క్లాస్ ప్రజలకు మద్దతివ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నెలకు రూ.లక్ష సంపాదించే వాళ్లకు ట్యాక్స్ రిలీఫ్ దక్కాలని, తాము నిజాయితీగా పన్ను చెల్లించేవారిని గుర్తిస్తామని తెలిపారు. ఆదాయపు పన్ను పరిమితి తగ్గించడం వల్ల వారి చేతుల్లో ఎక్కువ డబ్బులు ఉంటాయని, తద్వారా వినియోగం, పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని NDTV ఇంటర్వ్యూలో వివరించారు.

News February 2, 2025

RAILWAY: అన్నీ ఒకే యాప్‌లో..

image

ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు ఒకే దగ్గర కల్పించేందుకు రైల్వేశాఖ ‘SWA RAIL’ అనే సూపర్ యాప్ తెస్తోంది. తాజాగా కొంతమందికి EARLY ACCESS ఇచ్చింది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ట్రైన్ టికెట్ బుకింగ్, పార్శిల్ బుకింగ్, కోచ్ పొజిషన్, రన్నింగ్ స్టేటస్, ఫుడ్ ఆర్డర్ల కోసం వేర్వేరు యాప్స్ వాడే అవసరం లేకుండా అన్నీ ఇందులోనే ఉంటాయి.

News February 2, 2025

పెద్దపల్లిలో MLC కవిత రేపటి పర్యటన షెడ్యూల్

image

పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ కవిత సోమవారం పర్యటించనున్నారు అని కాల్వ శ్రీరాంపూర్ మండల యూత్ నాయకులు రవి తెలిపారు. పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. 12PM పెద్దపల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు @12:15PM మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నివాసంలో TBGKS నాయకులతో ఆత్మీయ సమీక్షలో పాల్గొంటారు @12:30 మీడియా సమావేశంలో మాట్లాడతారు @1PM సబితం గ్రామంలో జరిగే ఓ వివాహా వేడుకలో పాల్గొంటారు.