News February 7, 2025

డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత: తిరుపతి SP

image

సమాజంలో డ్రగ్ అడిక్షన్ చాలా ఎక్కువగా ఉందని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కరకంబాడి రోడ్ ఫ్యాబ్ బిల్డింగ్‌లో మెడికల్ షాప్ యజమానులు, డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ హరిప్రసాద్‌తో కలిసి ఎస్పీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్‌ని నిర్మూలించే బాధ్యత అందరిదని గుర్తు చేశారు. భావి తరాలు చెడిపోకుండా అందరూ సహకరించాలని కోరారు.

Similar News

News February 8, 2025

సంగారెడ్డి: నేడు పాఠశాలలకు పని దినం: డీఈవో

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర యాజమాన్యంకు సంబంధించిన పాఠశాలలు రేపు పని చేస్తాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జనవరి ఒకటవ తేదీన నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటించినందుకు, రేపు పాఠశాలల యథావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల హెచ్ఎమ్‌లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News February 8, 2025

మెదక్: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!

image

మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో 320 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన యువ అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు.

News February 8, 2025

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

ఓడల బండ్లును వచ్చును
ఓడలు నా బండ్లమీద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడుగలిమిలేమి వసుధను సుమతీ!
తాత్పర్యం: నావలపై బళ్లు, బళ్లపై నావలు వచ్చిన విధంగానే భాగ్యవంతులకు దారిద్య్రం, దరిద్రులకు భాగ్యం వస్తూ ఉంటాయి. పేదరికం, ఐశ్వర్యం శాశ్వతం కాదు.

error: Content is protected !!