News January 7, 2025

ఢిల్లీలో శాంతిపురం యువకుడి దారుణ హత్య

image

ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ యువకుడి నిండు ప్రాణం తీసింది. చిత్తూరు జిల్లా శాంతిపురం(M) వెంకటేల్లికి చెందిన హరి కుమారుడు సునీల్ దిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో సునీల్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.4 లక్షలు అప్పులు చేశాడు. 3 రోజుల కిందట కుటుంబసభ్యులు అతడికి రూ.2 లక్షలు పంపించారు. మిగిలిన రూ.2లక్షలు ఇవ్వలేదని యువకుడిని సోమవారం బెట్టింగ్ గ్యాంగ్ హత్య చేశారని మంగళవారం కుటుంబసభ్యులు ఆరోపించారు.

Similar News

News January 9, 2025

తిరుమల తొక్కిసలాట ఘటనపై స్పందించిన భూమన

image

వివాదాస్పద వ్యక్తులకు TTD పాలనా పగ్గాలు ఇస్తే ఇలాగే ఉంటుందని మాజీ ఛైర్మన్ భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆయన మాట్లాడుతూ.. టీడీడీ చరిత్రలో ఇదో చీకటి రోజని, CM చంద్రబాబు పాలనా వైఫల్యమే ఇందుకు కారణమన్నారు. ఇప్పటికీ పుష్కరాల ఘటన వెంటాడుతుందన్న ఆయన తాజా ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. YCP పాలనలో ఎన్నడూ ఇలా జరగలేదని TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి అన్నారు.

News January 9, 2025

తిరుపతి రుయాలో పోస్ట్‌మార్టం

image

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మొత్తం ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. వీరందరికీ మరికాసేపట్లో రుయా ఆసుపత్రిలోని మార్చురీలో పోస్ట్‌మార్టం చేయనున్నారు. స్విమ్స్‌లో చనిపోయిన ఇద్దరు, రుయాలో చనిపోయిన నలుగురి మృతదేహాలకు ఇక్కడే శపపరీక్ష చేసి బంధువులకు అప్పగించనున్నారు. ఇప్పటికే బంధువులు మార్చురీ వద్దకు చేరుకుని బోరున విలపిస్తున్నారు.

News January 9, 2025

తిరుపతి ఘటన బాధాకరం: AP గవర్నర్ 

image

తిరుపతిలో బుధవారం క్యూ లైన్లలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం, పలువురు గాయపడిన ఘటనపై AP గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.