News September 25, 2024

తత్కాల్ ద్వారా ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం: డీఈవో

image

అక్టోబర్ 3 నుంచి జరిగే ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్ష ఫీజు తత్కాల్ విధానంలో ఈనెల 25, 26న చెల్లించే అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు పరీక్ష ఫీజుతోపాటు పదవ తరగతికి అదనంగా 500, ఇంటర్ కు అదనంగా వెయ్యి రూపాయలు చెల్లించాలని చెప్పారు. పరీక్ష ఫీజు మీ సేవలో మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు.

Similar News

News September 29, 2024

రాష్ట్రపతి నిలయం కళా మహోత్సవానికి వర్గల్ నవోదయ విద్యార్థులు

image

బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జరిగిన అతిపెద్ద కళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్గల్ జవహర్ నవోదయ విద్యార్థులు 25 మంది పాల్గొన్నారని ప్రిన్సిపల్ రాజేందర్ తెలిపారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు భారతీయ కళా మహోత్సవంలో 430 మంది పాల్గొంటున్నారు.

News September 29, 2024

సంగారెడ్డి: DSC అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు పొడిగింపు

image

డీఎస్సీ -2008కి ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు పెంచుతున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రభుత్వ పనిదినాలైన సెప్టెంబర్ 30, అక్టోబర్ 1,3,4,5 తేదీల్లో డిఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

News September 28, 2024

MDK: డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్.. నేడు లాస్ట్

image

డీఎస్సీ అభ్యర్థులను ఎస్జీటీ కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విధితమే. సంగారెడ్డిలోని డీఈఓ కార్యాలయంలో 2008 డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 292 మంది అభ్యర్థులు ఉండగా, శుక్రవారం 132 మంది వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. నేడు కూడా ప్రక్రియ కొనసాగనున్నది.