News May 29, 2024

తలకొండపల్లి: రెండు బైక్‌లు ఢీ.. ఒకరి మృతి

image

తలకొండపల్లి సమీపంలోని దేవి ఫంక్షన్ హాల్ వద్ద బుధవారం సాయంత్రం రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మండలంలోని కర్కస్ తండాకు చెందిన కృష్ణ నాయక్ (45) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గాయపడ్డ మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న కాంగ్రెస్ మల్లురవి ఘటన స్థలంలో ఆగి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Similar News

News September 29, 2024

గద్వాల: ఉద్దెర ఇవ్వలేదని.. కాలుతున్న నూనె పోశాడు.!

image

యజమానిపై కాలుతున్న వంట నూనె పోసిన ఘటన గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలంలో చోటు చేసుకుంది. SI శ్రీనివాసులు వివరాల ప్రకారం.. గువ్వలదిన్నె గ్రామానికి చెందిన బుజ్జన్న గౌడ్ గ్రామంలో చిన్నపాటి హోటల్ నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వినోద్ ఉద్దెర ఇవ్వలేదని కోపంతో కాలుతున్న నూనె బుజ్జన్న గౌడ్‌పై పోయగా.. పక్కలో ఉన్న మరో వ్యక్తి వీరేష్‌పై పడింది. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 29, 2024

MBNR: ఓటరు జాబితా OK.. రిజర్వేషన్లే అసలు తంతు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఓటరు తుది జాబితా అన్ని గ్రామాల్లో అధికారులు ప్రదర్శించారు. దీంతో గ్రామాల్లో రిజర్వేషన్ల పైనే చర్చ నడుస్తుంది. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్‌ను పది సంవత్సరాలు కొనసాగించాలని గత ప్రభుత్వం చట్టం చేసింది. బీసీకు వార్డులు, పంచాయతీల రిజర్వేషన్లు పెంచేందుకు తెరపైకి రావడంతో ప్రభుత్వం ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

News September 29, 2024

MBNR: దివ్యాంగుడిని బ్రతికుండగానే చంపేశారు!

image

బతికున్న వ్యక్తిని ఆసరా పింఛను పోర్టల్‌లో చనిపోయినట్లు నమోదు చేయడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కృష్ణ మండలం ఖాన్‌దొడ్డి గ్రామానికి చెందిన హన్మంతు దివ్యాంగ పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత పెన్షన్ మంజూరు కాలేదని ఆరా తీయగా.. అధికారులు ఆసరా పోర్టల్‌లో చూసి’ నీవు చనిపోయినట్లు ఆసరా పోర్టల్‌లో ఉంది’ అని తెలిపారు. దీంతో హన్మంతు 6 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.