News April 13, 2024
తల్లాడ: చికిత్స పొందుతూ యువతి మృతి

చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన గూడూరు నవ్య (20) ఖమ్మంలో ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. కుటుంబ సభ్యులు నవ్యకు వివాహం చేయాలని సంబంధాలు చూస్తున్నారు. తాను చదువుకోవాలని, పెళ్లి చేసుకోనని నవ్య చెప్పినా తల్లిదండ్రులు వినకపోవడంతో పురుగుమందు తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
Similar News
News April 21, 2025
ఖమ్మం:ఓపెన్ పరీక్షలు..139గైర్హాజర్

ఖమ్మం జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పదో తరగతి పరీక్షలకు 488 మందికి గాను 420 మంది హాజరు కాగా 68 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షకు 646 మందికి గాను 575 మంది హాజరు కాగా, 71మంది గైర్హాజరయ్యారని డీఈఓ సోమశేఖర శర్మ తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు.
News April 21, 2025
కొత్తగూడెం: యువతికి వేధింపులు.. కేసు నమోదు

యువతిని వేధింపులకు గురిచేసిన యువకుడిపై కేసు నమోదైంది. వైరా విప్పలమడుగుకి చెందిన రాహుల్ కొత్తగూడెంకు చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ యువతి రాహుల్ వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఇచ్చేసింది. అయితే డబ్బు పూర్తిగా ఇవ్వలేదని.. దానికి బదులుగా తనతో శారీరకంగా దగ్గర కావాలని వేధిస్తున్నాడు. యువతి పోలీసులను ఆశ్రయించగా కేసు నమెాదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తగూడెం సీఐ కరుణాకర్ తెలిపారు.
News April 21, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు….

∆}మధిరలో జాబ్ మేళా∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు