News April 7, 2024

తవణంపల్లెలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె మండలంలో శనివారం అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పులిచెర్లలో 43.6, ఎస్ఆర్ పురం 42.9, విజయపురం, నగరి, నిండ్ర 42.8,పుంగనూరు, బంగారుపాళ్యం 41.5,సోమల 41.4,చిత్తూరు, సదుం 41.2,పాలసముద్రం, గుడిపల్లె 41,కుప్పం 40.9,చౌడేపల్లె, యాదమరి,రొంపిచెర్ల, ఐరాల 40.8, జీడీనెల్లూరు, వెదురుకుప్పం 40.7,కార్వేటినగరం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News April 3, 2025

చిత్తూరు: డీఆర్వోను కలిసిన ఫ్యాప్టో నాయకులు

image

12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని ఫ్యాప్టో చిత్తూరు జిల్లా ఛైర్మన్ మణిగండన్ డిమాండ్ చేశారు. డీఆర్వో మోహనకుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జీవో నెం.117ను రద్దు చేయాలని, తెలుగు మీడియాన్ని పునరుద్ధరించాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. 11వ PRC, డీఏ, సరెండర్ లీవ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్లను తక్షణం చెల్లించాలని కోరారు.

News April 2, 2025

చిత్తూరు: ముగ్గురికి కాంస్య పతకాలు

image

ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఖోఖో పోటీల్లో చిత్తూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు (ఫిజికల్ డైరెక్టర్లు) సురేష్ కుమార్, ముత్తు, దేవేంద్ర సత్తా చాటారు. ముగ్గురికీ కాంస్య పతకాలు దక్కాయి. ఈక్రమంలో వారిని కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. సహకారం అందించిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి బాలాజీని సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని సూచించారు.

News April 2, 2025

ద్రవిడ వర్సిటీలో పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో 2025-26వ సంవత్సరానికి సంబంధించి MA, M.Com, M.Scలో చేరడానికి APPGCET-2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ సూచించారు. మే 5వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. MBA/MCA కోర్సులో చేరటానికి APICET-2025 ప్రవేశ పరీక్షకు ఏప్రిల్ 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు cets.apsche.ap.gov.in చూడాలి.

error: Content is protected !!