News April 25, 2024

తాండూరు: ఇంటర్‌లో ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్య

image

ఇంటర్‌లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని అచ్చులాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మైదం నారాయణ కుమారుడు మైదం సాత్విక్ ఇంటర్‌లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకున్నట్లు ఎస్ఐ జగదీశ్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News February 5, 2025

గుడిహత్నూర్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కమలాపూర్ గ్రామానికి చెందిన భౌరే చిన్న గంగాధర్ (60) బైక్ పై ఆదిలాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో సీతాగొంది సమీపంలో ఉన్న హైమద్ ధాబా నుంచి యు టర్న్ తీసుకుంటుండగా ఓ కారు వచ్చి ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు వెల్లడించారు.

News February 5, 2025

ADB: రైలు పట్టాలపై పడి మృతి

image

తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన వ్యక్తి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం రెంగన్‌వాడి గ్రామానికి చెందిన సిడం చిత్రు (57), విఠల్‌తో కలిసి రైలులో ఇటీవల దైవదర్శనానికి తిరుపతికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడి చిత్రు మృతిచెందారు.

News February 5, 2025

నిర్మల్: ఇద్దరు ఉపాధ్యాయులపై పోక్సో కేసు: SI

image

నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న <<15345603>>ఉపాధ్యాయులపై<<>> పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిరణ్ బుధవారం తెలిపారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ శాఖ సూపర్‌వైజర్ ఫిర్యాదు చేయడంతో మోహన్ రావ్, మనోహర్ రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఎస్సై పేర్కొన్నారు.

error: Content is protected !!